Pragathi : ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఒక భూతంలా మారింది. సినీ ప్రపంచం అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అక్కడ ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ అనే పదం వినిపిస్తూ ఉంటుంది. మీ టూ ఉద్యమంతో పలువురు సెలబ్రిటీలు తాము కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడినట్టు చెబుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్స్ దగ్గర నుండి జూనియర్ ఆర్టిస్ట్ ల వరకూ కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం సీనియర్ నటి ప్రగతి కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డాను అంటూ సంచలన విషయాలను వెల్లడించింది. ఒక హీరో వలన ఆమె పడిన ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూ ద్వారా బయట పెట్టింది.
సీనియర్ నటి ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలలో నటించి నటన పరంగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా ఒదిగిపోయే నటి ప్రగతి. అత్తగా, తల్లిగా, భార్యగా అనేక పాత్రలలో తెలుగుతోపాటు తమిళ భాషల్లో కూడా దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. రీసెంట్ గా F3 చిత్రంలో నటించి తన కామెడీ స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఆమె లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో అప్డేట్ చేస్తూ అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటుంది. 50 ఏళ్లు దాటినా జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ తన అందచందాలు చూపిస్తూ వీడియోలను అప్‌లోడ్ చేస్తుంది. ఒక్కోసారి ప్రగతి వస్త్రధారణ వివాదాలకు దారితీస్తుంది. తన డ్యాన్స్ వీడియోలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రగతి కెరీర్ ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడినట్టు ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది. దర్శక నిర్మాతలు మాత్రమే కాకుండా ఓ స్టార్ హీరో కూడా తనను రోజంతా గడపమన్నాడు అని వేదన వ్యక్తం చేసింది. తనతో గడిపితేనే సినిమాలో నటించే అవకాశం ఇస్తా అని చెప్పాడని తెలిపారు ప్రగతి. తాను మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇలా చాలా మంది ఫీమేల్ ఆర్టిస్ట్ లు క్యాస్టింగ్ కౌచ్ అనే భూతంతో ఇబ్బంది పడుతున్నారని తెలియజేసింది. కానీ ఆ హీరో, నిర్మాతలు ఎవరు.. అనే అసలు పేర్లు మాత్రం బయటపెట్టలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…