Pragathi : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. వారిలో ప్రగతి కూడా ఒకరు. ఈమె సినిమాలతో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ప్రగతి వర్కవుట్ వీడియోస్, ఫోటోలు షేర్ చేసింది. దాంతో ఈమె పాపులారిటీ మరింత పెరిగింది.
ట్రెండింగ్ లో నిలుస్తూ యూత్ లో క్రేజ్ తెచ్చుకుంటోంది. హాట్ హాట్ గా కనిపిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా ఎఫ్ 3లో హీరోయిన్ మెహ్రిన్ కు తల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమెను రియల్ లైఫ్ లో కూడా కూతురిగా భావిస్తున్నట్లు తెలిపింది. అందుకే తమ మధ్య బాండింగ్ ఓ రేంజ్ లో ఉంటుందని తెలిపింది.
ఈ సందర్భంగా హీరోయిన్ రెజీనాతో కూడా తనకు మంచి రిలేషన్ ఉందని చెప్పింది. తనని రెజీనా.. అమ్మ అని పిలుస్తుంది.. అని తెలిపింది. ఇక తమ మధ్య సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో రిలేషన్ ఏర్పడిందని చెప్పింది.
అలాగే ఇలియానాతో జల్సా సినిమా చేస్తున్నప్పుడు అలాంటి అనుబందమే ఏర్పడిందని తెలిపింది. తను చేసే సినిమాల్లో ప్రతి ఒక్కరితోనూ ఆమెకు ఇలాగే ప్రత్యేకమైన అనుబంధం ఉందని కారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అన్నారు. నటి ప్రగతి ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. అనేక సినిమాల్లో ఆమె తల్లి పాత్రలను పోషించింది. దీంతో చాలా మంది హీరోయిన్స్‌ను తాను కూతుళ్లలా ట్రీట్ చేస్తుంటానని.. తెలిపింది.