Pragathi : వెండితెరపై సాంప్రదాయ పాత్రలకు ప్రగతి పెట్టింది పేరు. హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు. ప్రగతి దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. తల్లి పాత్రలకు ఆమె దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉంది. ప్రగతి సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే ఒకప్పటి ఆమె ఈమేనా అన్న భావన కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రగతి ఫిట్‌నెస్ మీద దృష్టి సారించింది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్టు చేస్తోంది. అవి వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో ప్రగతి తన జోరును పెంచింది. పెళ్లయి పిల్లలున్నా తాను ఇంకా కాలేజ్ గర్ల్ లాగా మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముద్ర పడిన ప్రగతి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కుర్రకారు మతిపోడుతుంది ప్రగతి. కట్ బనియన్స్ వేసుకుని చేస్తున్న వర్కౌట్స్ చూసి ఈ ఏజ్‌లో కూడా అస్సలు తగ్గట్లేదు, ఇరగదీస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రగతి కూతురు గీత.. పార్టీ ఈవెంట్లలో ఈ తల్లీకూతుళ్లు చేసే సందడి మామూలుగా ఉండదు.

ప్రగతిలానే గీత కూడా ఎంతో మోడ్రన్‌గా ఉంటుంది. పొట్టి బట్టల్లో ఈ ఇద్దరూ తెగ సందడి చేస్తుంటారు. ఇక తాజాగా ప్రగతి తన కూతురి మీద ప్రేమను కురిపించింది. డాటర్స్ డే సందర్భంగా కూతురి గురించి చెబుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ వేసింది. నా ఆశ, నా బలం, నా నమ్మకం, నా గర్వం, నా కాన్ఫిడెన్స్ అన్నీ నువ్వే.. నా సర్వస్వం నువ్వే.. నీలాంటి కూతురు నాకు ఉన్నందుకు నేను ఓ గొప్ప తల్లిని అని భావిస్తాను.. ఇలా ఎదుగుతూనే ఉండు.. వెలుగుతూనే ఉండు.. నిన్ను మిస్ అవుతున్నా.. లవ్యూ అమ్ములు అంటూ ప్రగతి ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రగతి చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.