Prabhudeva Wife : లేడీ సూపర్ స్టార్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కెరీర్ మొదట్లో ఎన్నో చిత్రాల్లో గ్లామర్ షో చేసింది. కానీ విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడినప్పటి నుంచి కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలను మాత్రమే చేస్తూ గ్లామర్ షోకు గుబ్ బై చెప్పింది. అయితే విగ్నేష్ శివన్‌ను నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్న నయనతార ఎట్టకేలకు వివాహం చేసుకుంది. వీరి వివాహం సెలబ్రిటీల మధ్య మహాబలిపురంలోని గ్రాండ్ షెరటాన్ హోటల్‌లో ఘనంగా జరిగింది. అయితే నయనతార వివాహం ఏమోగానీ.. గతంలో ప్రభుదేవా భార్య రామ్లాత్ ఒకసారి నయనతారపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడకముందు నయనతార ప్రభుదేవాను ప్రేమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా తన భార్య రామ్లాత్ కు విడాకులు కూడా ఇచ్చాడు. దీంతో వీరి పెళ్లి పీటల వరకు వచ్చింది. కానీ ఏం జరిగిందో తెలియదు.. వీరి పెళ్లి ఆగిపోయింది. తరువాత ఆమె మళ్లీ యథావిధిగా సినిమాలు చేసుకుంటూ కొంతకాలం గడిపింది. అనంతరం విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. అయితే ప్రభుదేవా తన భార్య రామ్లాత్ కు విడాకులు ఇచ్చినప్పుడు ఆమె నయనతార గురించి సంచలన ఆరోపణలు చేసింది.
నయనతార తన కాపురాన్ని కూల్చేసిందని.. రామ్లాత్ ఆరోపణలు చేసింది. తన బతుకు రోడ్డున పడేందుకు కారణం నయనతార అని.. తన భర్తను తనకు దూరం చేసిందని పేర్కొంది. తన భర్త తనతో 15 ఏళ్ల నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాడని.. ఆమె కోసమే తనకు విడాకులు ఇచ్చాడని ఆమె వాపోయింది. తమ జీవితాల్లో ఆమె చిచ్చు పెట్టిందని పేర్కొంది. తన భర్త తనను దేవతలా చూసుకునేవాడని.. ఆమె మాయలో పడి తనకు విడాకులు ఇచ్చాడని ఆమె ఆరోపణలు చేసింది. అయితే నయనతారను దేవుడు క్షమించడని.. తనకు ఆమె చిక్కితే కచ్చితంగా ఆమెను కొడతానని.. రామ్లాత్ పేర్కొంది. ఈ క్రమంలోనే నయనతార పెళ్లి నేపథ్యంలో రామ్లాత్ అన్న మాటలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…