Namrata Shirodkar : సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, ఒకప్పటి హీరోయిన్ నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె, మహేష్ బాబు టాలీవుడ్‌లోని క్యూట్ కపుల్స్‌లో ఒకరు. వీరికి సితార, గౌతమ్ కృష్ణ సంతానం. ప్రస్తుతం వీరు ఏ సమస్యా లేకుండా అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇక మహేష్ బాబుకు చెందిన బిజినెస్ వ్యవహారాలను నమ్రతనే స్వయంగా చూసుకుంటోంది. అయితే నమ్రత, మహేష్‌లది ప్రేహ వివాహం అన్న సంగతి తెలిసిందే. వీరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
వంశీ అనే సినిమా షూటింగ్ సమయంలో నమ్రత, మహేష్‌లు ప్రేమలో పడ్డారు. తరువాత పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి అయ్యాక నమ్రత సినిమాలకు వీడ్కోలు పలికింది. అప్పటికి ఆమె స్టార్ హీరోయిన్. సినిమాల్లో నటించి ఉంటే ఇంకా మంచి పేరు వచ్చేది. కానీ ఆమె సినిమాలకు గుబ్ బై చెప్పింది. ఇల్లాలిగా ఉండేందుకే సిద్ధపడింది. అయితే ఇదే విషయంపై నమ్రత ఇటీవల మీడియాతో మాట్లాడింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమెను జర్నలిస్టులు ప్రశ్నించారు. ఈ సందర్భగా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది.
మీరు సినిమాల్లో మళ్లీ నటించవచ్చు కదా.. రీఎంట్రీ ఇవ్వరా.. అని ఆమెను మీడియా ప్రతినిధులు అడిగారు. అయితే ఇందుకు ఓపిగ్గా నమ్రత సమాధానాలు చెప్పింది. నన్ను తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే అడుగుతున్నారు. అయితే హీరోయిన్‌గా కంటే ఓ భార్యగా, తల్లిగా ఉండేందుకే నేను ఇష్టపడతా. ప్రస్తుతం నేను నా కుటుంబ బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నా. ఇది నాకు చాలు, సినిమాలపై ప్రస్తుతం దృష్టి సారించలేను. అయితే రాబోయే రోజుల్లోనూ నేను సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదు.. అని నమ్రత తేల్చేసింది.
ఇక నమ్రత అలా చెప్పడంపై ఫ్యాన్స్ హర్టయ్యారు. ఆమె ఎప్పటికైనా సరే సినిమాల్లోకి వస్తుందని.. మహేష్‌తో కలసి నటిస్తుందని ఫ్యాన్స్ ఇప్పటి వరకు ఆశిస్తూ వచ్చారు. కానీ అది జరగదని తేలిపోయింది. దీంతో వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే నమ్రత రీ ఎంట్రీపై ఇప్పటి వరకు మహేష్ మాట్లాడలేదు. ఆయన సైలెంట్‌గానే ఉన్నారు. మరి దీనిపై ఆయన ఏమంటారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…