Prabhu Deva : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో మంచి కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న ప్రభుదేవా గతంలో ఒక హీరోయిన్ తో ప్రేమలో పడిన సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండగా ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించిన ప్రభుదేవా ఏకంగా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు.
ఇలా తన భార్యతో విడాకుల అనంతరం కొన్ని రోజులపాటు రిలేషన్ లో ఉన్న వీరు పెళ్లి చేసుకోవాలని భావించారు. పెళ్లి విషయం వచ్చేటప్పటికి ప్రభుదేవా వెనకడుగు వేయడంతో ఆ హీరోయిన్ తనని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే ప్రభుదేవాను పెళ్ళి చేసుకోవడం కోసం పెద్ద ప్రణాళిక వేసి గర్భవతి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగేలా చేసిందట.
అయితే తనను పెళ్లి చేసుకోవడం కోసం ఆ హీరోయిన్ వేసిన పథకాన్ని గుర్తించిన ప్రభుదేవాఈ విషయంపై ఆ హీరోయిన్ తో గొడవ పడినట్లు తెలిసింది. దీంతో ఆ హీరోయిన్ అసలు గుట్టు బయటపడటంతో క్రమంగా తనని దూరం పెట్టాడట. అలా ఆ హీరోయిన్ ను దూరం పెట్టి తిరిగి తన భార్యతో ప్రభుదేవా కలిసి ఉన్నారు. ఇలా ప్రభుదేవాతో విడిపోయిన ఆ హీరోయిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది.