Srihari : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న అత్యంత సన్నిహితుల్లో ప్రభాస్ శ్రీను ఒకరు. వీరిద్దరికీ సినిమాల్లో రాకముందు నుంచే పరిచయం, స్నేహం ఉంది. తాజాగా ప్రముఖ కమెడియన్ అయిన శ్రీను.. రియల్ హీరో శ్రీహరితో తనకున్న అనుబంధంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీహరి చివరి రోజుల్లో పేగులు కొరుక్కుపోయినా నవ్వుతూ షూటింగ్ చేసే వాడని తెలిపాడు. ప్రభాస్ శ్రీను.. సినిమాల్లోకి రావడానికి ముందు నుంచి ప్రభాస్ తో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆయన్ని ప్రభాస్ శ్రీను అనే పిలుస్తూ ఉంటారు.
ప్రభాస్ తోపాటు చాలా సినిమాల్లో నటించిన ఆయన ప్రభాస్ తోనే సినిమా జీవితం స్టార్ట్ చేశాడు. యంగ్ రెబల్ స్టార్ కు డేట్స్ కూడా చూశాడు శ్రీను. ప్రభాస్ కు అన్నీ తానై చూసుకున్న ఆయన ఆ తరువాత కాస్త దూరం అయ్యాడు. సినిమాల్లో బిజీ అయిపోవడమో.. లేక ఇద్దరి మధ్య ఏమైనా ఇష్యూస్ రావడమో తెలియదు కానీ.. శ్రీను ప్రభాస్ కు దూరంగానే ఉంటున్నట్టు ఫిల్మ్ సర్కిల్ లో వార్తలు వినిపించాయి. శ్రీను ఎక్కువగా విలన్ గ్యాంగ్ లో రౌడీగా కనిపిస్తూ వచ్చినా ఆ తర్వాత కమెడియన్ గా బిజీ అయ్యాడు.
ఇక తాజాగా ప్రభాస్ శ్రీను ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీహరితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. శ్రీహరి ఎంతో మంచి వాడని చాలా ఆప్యాయతగా పలకరించేవాడని అన్నాడు. ఓ సినిమా షూటింగ్ సంవత్సరానికిపైగా జరగడంతో రోజూ కలిసే వాళ్ళమని, సరదాగా ఉంటూ జోక్స్ వేసుకునే వాళ్ళం.. నా జోక్స్ ని శ్రీహరి బాగా ఎంజాయ్ చేసే వాడని చెప్పుకొచ్చాడు. అయితే అన్ని రోజులు అంత క్లోజ్ గా ఉన్నా తన బాధ ఎవరికీ తెలియనిచ్చే వాడు కాదని.. శ్రీహరి చివరి రోజుల్లో పేగులు కొరుక్కుపోయినా నవ్వుతూ షూటింగ్ చేసే వాడని ప్రభాస్ శ్రీను తెలిపాడు. ఈ క్రమంలోనే ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…