Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్‌ను ఒకేసారి చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చేస్తున్న సినిమాలను ఇంకా పూర్తి చేయలేదు, అయినప్పటికీ తన మరో మూవీని ఆయన ప్రకటించారు. తన 25వ సినిమాను స్పిరిట్ పేరిట తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ వివరాలను ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. స్పిరిట్ మూవీలో ప్రభాస్ పక్కన ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.
కరీనా కపూర్ ప్రస్తుతం అమీర్‌ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చడ్డా మూవీలో చేస్తోంది. ఇందులో కరీనా లుక్ అద్భుతంగా ఉండనుంది. కాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ స్క్రిప్ట్‌తో కరీనాను సంప్రదించినట్లు సమాచారం. ఇందుకు కరీనా కపూర్ కూడా ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది.
కాగా కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ మూవీలో ప్రభాస్‌కు వ్యతిరేకంగా రావణుడి పాత్రలో నటించారు. ఆయన పార్ట్ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుని కేక్ కట్ చేసి చిత్ర యూనిట్‌కు వీడ్కోలు పలికారు. ఇక ప్రభాస్ ఇటీవలే కరీనా కపూర్‌కు హైదరాబాదీ బిర్యానీని పంపించారు. దీంతో ఆమె వాటి తాలూకు ఫోటోలను తన సోషల్ ఖాతాల్లో షేర్ చేసింది.
బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ ఒక్కో ప్రాజెక్ట్‌కు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే స్పిరిట్ మూవీలో కరీనా నటిస్తుందా, లేదా ? అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. కానీ త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…