Prabhas : ప్రస్తుతం మన సౌత్ సినిమాలు బాలీవుడ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా నార్త్‌లో రికార్డులు క్రియేట్ చేయడంతో అదే ఉత్సాహంతో మిగతా హీరోలు కూడా తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదు. ఆయనకు దేశ విదేశాలలో అశేష అభిమాన గణం ఏర్పడింది. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచాయి. అయినప్పటికీ బీటౌన్‌లో ఆయన సినిమాలపై క్రేజ్ తగ్గలేదు. ఈ క్రమంలో ప్రభాస్ మీద బురదజల్లే ప్రోగ్రామ్ షురూ చేశారు.

భారీ అంచనాలతో విడుదలైన రాధే శ్యామ్ సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేదు. బాలీవుడ్ లో కొంత మంది మాత్రం పనిగట్టుకుని మరీ ప్రభాస్ మీద నెగెటివ్ కామెంట్స్ మొదలుపెట్టారు. కొంత మంది క్రిటిక్స్ ప్రభాస్ వయస్సుని వంకగా చూపిస్తూ విమర్శలు చేశారు. ప్రభాస్ చెల్లిగా భాగ్యశ్రీ కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. ఇక ప్రభాస్ క్రేజ్‌ను బాలీవుడ్‌లో తగ్గించడానికి మరీ దిగజారి వడప్పావ్ వంటి ఆహార పదార్థాలతో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. రాధేశ్యామ్ ఫ్లాప్‌తో ప్రభాస్‌ని బాలీవుడ్ జనాలు ట్రోల్ చేసినా ప్రభాస్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఆదిపురుష్, సలార్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌తో తగ్గేదేలే అంటున్నాడు.
ఇక ఆది పురుష్, సలార్ సినిమాలు మంచి హిట్ సాధిస్తే మాత్రం ఇప్పుడు విమర్శించిన వాళ్లు నోరు మూసుకోక తప్పదు. అయితే మిర్చి తర్వాత ప్రభాస్ ఫేస్‌లో గ్లో పోయిందని అంటున్నారు. బాహుబలి తర్వాత ఆయన ఫేస్ పూర్తిగా మారిపోయిందని, పాత గ్లో కనిపించడం లేదని వాపోతున్నారు. ప్రభాస్ అభిమానులే కొందరు ఇలాంటి కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు చాలా మంది ప్రభాస్ ఫేస్ పై ట్రోల్ చేస్తున్నారు. కామెడీ సీన్స్ పెట్టి సెటైర్లు వేస్తున్నారు. ఫేస్‌పై దృష్టిపెట్టాలని, ఇలా అయితే కష్టమని అంటున్నారు.