Prabhas : అభిమానులందు వీరాభిమానులు వేరయా అనే చెప్పాలి. తాజాగా ప్రభాస్ అభిమాని రాధేశ్యామ్ అప్‌డేట్స్ ఇవ్వడం లేదని సూసైడ్ నోట్ రాశాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే.. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.
రాధేశ్యామ్ చిత్రం ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ కరోనా వలన వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రం రెగ్యులర్‌గా రావడం లేదు. ప్రభాస్ బర్త్ డేకు టీజర్ వదిలారు. ఆ తర్వాత మరో అప్‌డేట్ లేదు.
ఈ విషయం ప్రభాస్ అభిమానులని చాలా నిరుత్సాహపరచింది. ఈ క్రమంలోనే ఓ డై హార్డ్ ఫ్యాన్ వినూత్నంగా నిరసన తెలిపాడు. యూవీ క్రియేషన్స్ తీరుతో విసిగిపోయి.. ఆత్మ హత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాశాడు. తన చావుకు యూవీ క్రియేషన్స్, రాధే శ్యామ్ డైరెక్టర్ రాధా కృష్ణ కారణం అని లేఖలో పేర్కొన్నాడు. రాధే శ్యామ్ అప్‌డేట్స్ కోసం చాలా కాలంగా ఎదురు చూశాం. ఇంకా అప్‌డేట్స్ వస్తాయి అనుకుంటే, అది జరగడం లేదు. కనీసం నా చావుతో అయినా మీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. అంటూ సూసైడ్ నోట్ లో తన మనోభావాలు వెల్లడించాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…