రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వరుస ఫ్లాప్ లు వచ్చినప్పటికీ డార్లింగ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 43వ పుట్టిన రోజు వేడుకలను ఈ రోజు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే రెబల్ రీ-రిలీజ్ అవ్వగా.. ఈరోజు బిల్లా 4కే వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
దీంతో థియేటర్లలో అభిమానుల సందడి మామూలుగా లేదు. సినిమా హాళ్ల వద్ద భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి డార్లింగ్ బర్త్ డే వేడుకలను నిర్వహించారు. అలాగే బిల్లా రీ-రిలీజ్ సందర్భంగా అభిమానులు తీవ్ర అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో ఓ థియేటర్ మొత్తం కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్ లో ఈ ఘటన జరిగింది. తాజా సమాచారం ప్రకారం..
చాలాకాలంగా మూతబడిన వెంకట్రామ థియేటర్ ను బిల్లా స్పెషల్ షో కోసం రీఓపెన్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షో స్టార్ట్ కాగానే థియేటర్ లో బాణాసంచా పేల్చారు. దీంతో ఒక్కసారిగా థియేటర్ లోని సీట్లకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. ఆడియెన్స్ ఒక్కసారిగా భయంతో బయటికి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది మంటల్ని ఆర్పి షోను నిలిపివేశారు. అభిమానం హద్దులు మీరితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో మరోసారి రుజువైంది. ఇదిలా ఉండగా పలువురు డార్లింగ్ కి బర్త్ డే విషెస్ చెప్తున్నారు.
Rebels on rampage mode 😎🔥🔥🔥💥#HappyBirthdayPrabhas #Billa4KCelebrations pic.twitter.com/A9IvJ4uKKx
— 𝖵𝗂𝗃𝖺𝗒𝖺𝗐𝖺𝖽𝖺 𝖯𝗋𝖺𝖻𝗁𝖺𝗌 𝖥𝖢™ (@VJYPrabhasFC) October 23, 2022