Posani : సాయిధరమ్ తేజ్‌కు చెందిన రిపబ్లిక్ మూవీ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం, మంత్రులపై విమర్శలు చేయడం ఏమోగానీ ఆ వివాదం పెను దుమారంగా మారుతోంది. దీనిపై పోసాని కృష్ణమురళి ఇప్పటికే ఘాటుగా స్పందించారు. పవన్‌ను ఆయన విమర్శించారు. అయితే ఇది జీర్ణించుకోలేని పవన్ ఫ్యాన్స్ పోసానికి గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్ కాల్స్ చేశారు. మెసేజ్‌లు పెట్టారు. కాగా దీనిపై పోసాని తాజాగా మీడియాతో మాట్లాడారు.
పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని, తనని తిడుతూ గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు వచ్చాయని పోసాని కృష్ణమురళి అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ కక్ష కట్టి మాట్లాడటం సరికాదని, పవన్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
తనపై పవన్ కల్యాణ్‌కు పీకల దాకా కోపం ఉందని పోసాని అన్నారు. అయినప్పటికీ పవన్‌పై తనకు కోపం లేదన్నారు. తాను జగన్ అభిమానిని అని, తనకు శత్రువులు ఎవరూ లేరని అన్నారు. పవన్ అభిమానుల్లా తాను అసభ్య పదజాలంతో మాట్లాడనని అన్నారు. పవన్‌ను ప్రశ్నించినందుకు తనకు రాత్రి నుంచి కొన్ని వేల ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వచ్చాయన్నారు.
ఇంత మాట్లాడినా పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ గురించి ఎందుకు పెదవి విప్పలేదని పోసాని అన్నారు. చిరంజీవి అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. పవన్ ఫ్యాన్స్ సైకోలని, వాళ్లకు ఏం చెప్పుకుంటావో చెప్పుకో.. అని పోసాని అన్నారు. రాజకీయాల్లో తన గురించి మాట్లాడాలని, తన కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దని అన్నారు. చిరంజీవి గారు, మీ తమ్ముడిని అదుపులో పెట్టుకోండి.. అని పోసాని పేర్కొన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…