Mohan Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్‌బాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేక చిత్రాల్లో ఆయన విలన్‌గా, హీరోగా మెప్పించారు. నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా రాణించారు. మొత్తం 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన తాజాగా తన జీవితానికి చెందిన పలు విశేషాలను పంచుకున్నారు.
ప్రముఖ నటుడు, కమెడియన్ ఆలీ పేరిట ఆలీతో సరదాగా అనే కార్యక్రమం ఈటీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యక్రమానికి మోహన్ బాబు హాజరై ఆలీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు అనుభవాలను ఆయన ఆలీతో పంచుకున్నారు. తాను సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు ఒక స్కూల్‌లో నెలకు కేవలం రూ.140 జీతం మాత్రమే తీసుకుని పనిచేశానని మోహన్ బాబు చెప్పారు.
ఆ స్కూల్‌లో ఏడాది కాలం పాటు డ్రిల్ మాస్టర్‌గా పనిచేశానని, అయితే ఆ సమయంలో తనను కులం పేరిట ఎంతో అవమానించారని అన్నారు. స్కూల్ నిర్వాహకులకు చెందిన కులం వాడ్ని కాకపోవడంతో తనను అవమానించేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు ఎంతో బాధ వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కులం ఎవరికీ చదువుకు అడ్డం కాకూడదనే ఉద్దేశంతోనే తాను విద్యాసంస్థలను ప్రారంభించానని తెలిపారు.
ఈ క్రమంలోనే విద్యా నికేతన్ పాఠశాలను ప్రారంభించానని, తమ స్కూల్‌లో కులం అనే కాలమ్‌ను తొలగించానని తెలిపారు. మొట్ట మొదటిసారిగా కులం అనే కాలమ్‌ను తొలగించిన వ్యక్తిని తానేనని అన్నారు. ఇలా అప్పట్లో కులం పేరిట తాను ఎన్నో అవమానాల పాలయ్యానని తెలిపారు.
అయితే సినిమాల్లో ఈ స్టైల్ ఎలా వచ్చిందని అడగ్గా.. తాను పట్టుబట్టి నేర్చుకున్నానని మోహన్ బాబు తెలియజేశారు. అందుకనే ప్రేక్షకులు తనను ఆదరించారని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…