Poonam Kaur : ఎలాంటి విషయాల్లోనైనా తన అభిప్రాయాన్ని ఏమాత్రం భయపడకుండా చెప్పే నటి పూనమ్ కౌర్. ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే పూనమ్ కు దేవుడు అంటే ఎంతో భక్తి కూడా ఉంది. తరచూ పూనమ్ కౌర్ సోషల్ మీడియా పోస్ట్స్ వివాదాస్పదం అవుతుంటాయి. ఆమె పరోక్షంగా ఎవరినో టార్గెట్ చేస్తున్నట్లు పోస్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా హీరో పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటైరికల్ పోస్ట్స్ వేస్తూ ఉంటుంది. పూనమ్ చర్యలు నచ్చని పవన్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడుతూ ఉంటారు. గత కొన్నాళ్లుగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా పూనమ్ కౌర్ నెటిజన్లని కన్ఫ్యూజ్ చేస్తూ మరో పోస్ట్ పెట్టింది. ఇంస్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ అర్థంకాక నెటిజన్లు తలలు బాదుకుంటున్నారు. నార్త్ లో పెళ్ళైన మహిళలు కార్వా చౌత్ పండగని సెలెబ్రేట్ చేసుకుంటారు. భర్త క్షేమంగా ఉండాలని భార్యలు జరుపుకునే పండుగ ఇది. కానీ పూనమ్ కౌర్ కూడా ఈ పండుగని సెలెబ్రేట్ చేసుకుంది. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అసలు పూనమ్ కౌర్ కి పెళ్లి ఎప్పుడు అయింది అంటూ నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు.

పూనమ్ కి ఆల్రెడీ పెళ్లి అయ్యిందా లేక త్వరలో పెళ్ళికి రెడీ అవుతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. పూనమ్ మాత్రం చేతిలో జల్లెడ పట్టుకుని దీపాల కాంతుల్లో ఉన్న అందమైన ఫోటోని షేర్ చేసింది. సెలెబ్రిటీలు కూడా కార్వాచౌత్ సెలెబ్రేషన్స్ లో పాల్గొనడం చూస్తూనే ఉన్నాం. పూనమ్ కౌర్ తెలుగులో గగనం, శౌర్యం, వినాయకుడు, ఈనాడు లాంటి చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకోలేకపోయిన పూనమ్ కెరీర్ లో చిన్న చిన్న పాత్రలతోనే సరిపెట్టుకుంది.