Poonam Kaur : నటి పూనమ్ కౌర్ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ట్విట్టర్ వేదికగా ఆమె చేసే ట్వీట్లు వివాదాస్పదం అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అలాంటి ఎన్నో వివాదాస్పద ట్వీట్లు చేసింది. తరువాత వెంటనే డిలీట్ చేసింది. అయితే ఇప్పుడు కూడా ఆమె అలాగే చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీని కించ పరిచేలా ఆమె ట్వీట్ చేసింది. అయితే ఏమనుకుందో ఏమోగానీ వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఆ ట్వీట్ తాలూకు ఫొటో వైరల్‌గా మారింది.

తాజాగా ప్రధాని మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొని తెలుగు సినిమాలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక్కడ ఎంతో క్రియేటివ్‌గా సినిమాలను తీస్తారని.. తెలుగు భాష కూడా ఎంతో గొప్పదని మోదీ అన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.
తెలుగు సినిమాని ప్రధాన మంత్రి అర్థం చేసుకున్న విధానం.. ఇక్కడ ఉన్న దుస్థితికి చాలా తేడా ఉంది.. అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. అయితే ఆమె ఆ ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేసింది. కానీ దాన్ని అప్పటికే స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేశారు. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఓ వైపు ప్రధాని అంతటి వారే తెలుగు సినిమాను మెచ్చుకుంటే పూనమ్ కౌర్ మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీని కించ పరిచేలా వ్యాఖ్యలు చేసిందని.. ఇది సరికాదని అంటున్నారు. మొత్తానికి పూనమ్ కౌర్ మళ్లీ వివాదాస్పద ట్వీట్‌తో వార్తల్లో నిలిచింది.