Pooja Hegde : ప్రతి మనిషి జీవితంలోనూ ఎత్తు పల్లాలు ఉంటాయి. కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు ఉంటాయి. ఎల్లప్పుడూ ఎవరూ కష్టాలనే లేదా సుఖాలనే అనుభవించరు. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇవి ఎదురవుతూ ఉంటాయి. అయితే కొందరికి తీరని కోరికలు కూడా ఉంటాయి. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా.. ఎంత డబ్బు సంపాదించినా.. కొందరికి మాత్రం కొన్ని కోరికలు తీరవు. అవి ఎంత ప్రయత్నించినా అందని ద్రాక్షల్లాగే ఉంటాయి. అయితే కొందరు ఎట్టకేలకు వాటిని తీర్చుకోగలుగుతారు. కానీ కొందరికి మాత్రం అనుకున్న కోరికలు ఏం చేసినా తీరవు. అలాంటి వారిలో పూజా హెగ్డె ఒకరని చెప్పవచ్చు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
బుట్టబొమ్మ పూజా హెగ్డె తెలుగులో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిలిచింది. గతేడాది ఆమె నటించిన 6 చిత్రాలు వరుస హిట్స్‌గా నిలిచాయి. దీంతో ఆమెకు కెరీర్ మొదట్లో ఉన్న ఐరన్ లెగ్ అన్న ముద్ర పోయి గోల్డెన్ లెగ్ అన్న ముద్ర వచ్చింది. అయితే పూజా హెగ్డె తన కెరీర్ ఆరంభంలో పలు హిందీ చిత్రాల్లోనూ నటించింది. కానీ ఈ అమ్మడు హిందీలో చేసిన అన్ని చిత్రాలూ ఫ్లాప్ అయ్యాయి. ఒక్కటి కూడా ఆశించినంత సక్సెస్‌ను అయితే ఇవ్వలేదు. దీంతో ఈమె సౌత్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. ఫలితంగా ఇక్కడ అనేక హిట్స్ కొట్టింది. అయితే ఇదే విషయంపై ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. అందులో పలు కీలక విషయాలను తెలియజేసింది.
తాను టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని.. వరుసగా 6 సినిమాలు విజయం సాధించడంతో ఎంతో హ్యాపీగా ఉన్నానని తెలియజేసింది. అయితే తనకు తీరని కోరిక ఒక్కటి ఉందని.. బాలీవుడ్‌లో తాను నటించే కనీసం ఒక్క చిత్రం అయినా హిట్ కావాలని కోరుకుంటున్నానని తెలిపింది. తనకు అది చిరకాల కోరికని అది ఎప్పటికి తీరుతుందో.. అసలు నెరవేరుతుందో.. లేదో.. అని ఈమె విచారం వ్యక్తం చేసింది. ఈమెకు ఇతర భాషల చిత్రాల్లో సక్సెస్ వస్తున్నప్పటికీ హిందీలో మాత్రం ఇంకా సక్సెస్ రాలేదు. అక్కడ కనీసం ఒక్క హిట్ సాధించినా చాలు.. పాగా వేయవచ్చు. అందుకనే తనకు ఆ కోరిక ఒక్కటి తీరడం లేదని పూజా హెగ్డె తెలియజేసింది.
ఇక ఈమె ప్రస్తుతం రణవీర్ సింగ్‌తో కలిసి సర్కస్ అనే మూవీలో నటిస్తుండగా.. ఈ మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఇంకో వారం గ్యాప్‌లో.. అంటే.. డిసెంబర్ 30న సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్న కభీ ఈద్ కబీ దివాలీ అనే చిత్రం రిలీజ్ అవుతుంది. ఇలా వారం వ్యవధిలో పూజాకు చెందిన చిత్రాలు రెండు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కానున్నాయి. మరి ఈ చిత్రాల్లో ఒక్కటి అయినా హిట్ ను సాధిస్తుందా.. దాంతో పూజా అక్కడ బిజీ అవుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది. అయితే ఈమె నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో మూడు రిలీజ్ అయినా అవి ఫ్లాప్ అయ్యాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలు నిరాశ పరిచాయి. మరి ఈ అమ్మడి కెరీర్ ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.