Pooja Hegde : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డె ఒకరు. ముకుంద మూవీతో యూత్ లో పూజా హెగ్డే కి మంచి క్రేజ్ వచ్చింది. దాదాపు సౌత్ స్టార్ హీరోలందరితోనూ జత కట్టింది. వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. అయితే ఇటీవల పూజా నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి చిత్రాలు నిరాశ పరిచినా పూజ క్రేజ్ మాత్రం తగ్గలేదు. తెలుగు చిత్రాలతోపాటు హిందీలో కూడా రెండు సినిమాలు చేస్తోంది. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కభీ ఈథ్ కభీ దివాలీ, సర్కస్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.
అయితే పూజా హెగ్డే ఇండస్ట్రీలోకి వచ్చి చాలాకాలం అవుతున్నా.. ఎవరిపై ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. తాజాగా పూజ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మట్లాడుతూ.. హీరోయిన్ అవ్వాలనుకునే వారికి అదృష్టం బాగుండాలి. టైం కలిసి రావాలి, దీనికి తోడు కష్టపడే తత్వం కూడా ఉండాలి. వీటన్నింటిలోకెల్లా ఓపిక చాలా అవసరం. అదే లేకపోతే సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం నెగ్గుకు రాలేరని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.

ప్రస్తుతం పూజా హెగ్డే అన్న మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కెరీర్ మళ్లీ నెగెటివ్ దశలోకి వెళ్తున్న క్రమంలో పూజా.. ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం తను సక్సెస్ లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఇంకొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న జనగణమణ మూవీతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబుతోనూ పూజా హేగ్డే మరో మూవీ చేయనుంది.