Pooja Hegde : వెండితెర బుట్ట బొమ్మగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే ప్రస్తుతం అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ప్రభాస్ సరసన రాధేశ్యామ్, ఆచార్యలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి పూజా హెగ్డే నటిస్తున్న సినిమాలన్నీ కేవలం పండగ బరిలో దిగి అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.
ఈ క్రమంలోనే పూజా హెగ్డే నటించిన హిందీ మూవీ `హౌస్ ఫుల్ 4` 2019లో దీపావళికి విడుదలై మంచి గుర్తింపు పొందింది. అదేవిధంగా 2020 సంవత్సరంలో అల్లు అర్జున్ సరసన నటించిన అల వైకుంఠపురం సంక్రాంతికి విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ప్రస్తుతం అఖిల్ సరసన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా దసరా కానుకగా విడుదల కానుంది. మరి ఈ దసరా.. బుట్ట బొమ్మకు కలిసొస్తుందో లేదో వేచి చూడాలి.
అదే విధంగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ రాబోతోంది. అలాగే ఆచార్య సినిమా కూడా వచ్చే ఏడాది దీపావళికి విడుదల కాబోతుంది.. అంటూ ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా బుట్ట బొమ్మ సినిమాలు మాత్రం పండుగ బరిలోనే దిగుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. మరి ఈ సెంటిమెంట్ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూస్తే తెలుస్తుంది.