Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డె ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారింది. గతేడాది అన్నీ విజయాలనే చవిచూసిన ఈ అమ్మడికి గత రెండు చిత్రాలు మాత్రం భారీ షాక్‌నే ఇచ్చాయి. ఈమె నటించిన బీస్ట్, రాధేశ్యామ్ వంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో త్వరలో విడుదల కానున్న ఆచార్య మూవీపైనే ఈమె ఆశలు పెట్టుకుంది. ఒక వేళ అది కూడా ఆశించిన మేర సక్సెస్ కాలేకపోతే పూజా హెగ్డెకు మళ్లీ పాత ముద్ర వేయడం ఖాయం. అప్పట్లో ఈమెకు ఐరన్ లెగ్ అన్న పేరుండేది. కానీ ఆ తరువాత ఈమె గోల్డెన్ లెగ్ అన్న ముద్రను సొంతం చేసుకుంది. ఇక తాజాగా చూస్తుంటే ఆమెకు మళ్లీ పాత పేరు వస్తుందేమోనని అంటున్నారు. అయితే పూజా హెగ్డె తాజాగా నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవుతోంది. ఆమెను వారు ఉతికి ఆరేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

సినిమాల్లో హీరోయిన్లు అందాలను ఆరబోయడం అనేది కామన్. ఇది ఇప్పుడు మొదలైన ట్రెండ్ కాదు. ప్రేక్షకులను అలరించడం కోసం.. థియేటర్లకు వారిని రప్పించేందుకు హీరోయిన్లచే దర్శకులు గ్లామర్ షో చేయిస్తుంటారు. కొందరు దర్శకులు అయితే ఈ షోను మరీ శృతి మించి చేస్తుంటారు. అయితే దీనిపైనే పూజా హెగ్డె ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. నార్త్‌లో కాదు కానీ.. సౌత్‌లో మాత్రం హీరోయిన్ల అందాలను బాగా చూపించాలని దర్శక నిర్మాతలు ఆరాటపడుతుంటారు. మా మనస్సులో ఏముందనేది చూడరు.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంటే.. తమకు ఇష్టం లేకపోయినా ఫిలిం మేకర్స్ ఒత్తిడి మేరకు అలా అందాల ప్రదర్శన చేయాల్సి వస్తుందన్నది.. ఈ అమ్మడి మాట. అయితే దీనికి నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.
పూజా హెగ్డె నటించిన ఆచార్య చిత్రానికి చెందిన ఓ రొమాంటిక్ సాంగ్ గతంలో విడుదలైంది. ఇందులో ఈమె చరణ్ పక్కన చేసింది. అయితే అందులో ఈమె నాభి అందాలు చూపించి చూపించనట్లుగా ఉన్నాయి. అయితే ఈమె కావాలనే అలాంటి దుస్తులు ధరించిందని.. సహజంగా కొరటాల సినిమాల్లో ఇలాంటి ప్రదర్శన ఉండదని.. అయినప్పటికీ పూజా హెగ్డె తన ఇష్టం మేరకే తన అందాలను కాస్తంత చూపించిందని.. ఇదంతా ప్రేక్షకులను అలరించడం కోసం.. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవడం కోసమేనని నెటిజన్లు అంటున్నారు. అందుకనే ఆమె అలా చేసిందని అంటున్నారు. ఈ విషయంలో దర్శకుడి ప్రమేయం లేనప్పుడు అందాలను ఆరబోయడం ఎందుకు.. అంటే మీరు పాపులర్ అయ్యేందుకు అందాలను ఆరబోస్తారు.. కానీ దర్శకుల మీద అయితే ముద్ర వేస్తారు.. మీకు ఇష్టం లేకున్నా వారి బలవంతం మీద మీరు అలా అందాలను ఆరబోశారని చెబుతారు.. ఇదంతా ఎందుకు.. మీక్కూడా ఇలా చేయడం ఇష్టమే కదా. అలాంటప్పుడు దక్షిణాది వారి మీద పడి ఏడవడం ఎందుకు ? అని నెటిజన్లు పూజాకు బాగానే కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.