Pooja Hegde : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఇప్పుడు పూజ పాన్ ఇండియా హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది మొదటి నుంచే బుట్టబొమ్మ పూజా హెగ్డేకు వరుస ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, కోలీవుడ్ లో చేసిన బీస్ట్ మూవీ, ఆ తర్వాత మెగా మల్టీస్టారర్ ఆచార్య.. ఇలా వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. టాలీవుడ్ బుట్ట బొమ్మ.. ప్రజెంట్ వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతుంది.
అమ్మడు అదృష్టమో లేక టాలెంటో తెలియదు కానీ తీసిన ప్రతి సినిమా మొదట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇదే క్రమంలో హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో నిర్మాతలకి లాభాల పంట పండించింది. నిర్మాతల పాలిట పూజా హెగ్డే దేవతలా మారిపోయింది. అయితే ఇటీవల వచ్చిన సినిమాలు వచ్చినట్టే ఒకదాని తర్వాత ఒకటి భారీ డిజాస్టర్ గా టాక్ తెచ్చుకోవడంతో.. సినీ ఇండస్ట్రీలో పూజ హెగ్డే గ్రాఫ్ డౌన్ అయింది. ఇదిలా ఉండగా పూజ హెగ్డే వరుస సినిమాలు చేస్తున్న టైంలోనే స్టార్ ప్రొడ్యూసర్స్ వెబ్ సిరీస్ లో కూడా నటించే అవకాశం కల్పించారట.

కానీ పూజా హెగ్డే వెబ్ సిరీస్ అంటే.. ఫామ్ లో లేని హీరోయిన్స్ చేసేవి.. ఫామ్ లో ఉన్న వాళ్ళు చేసేది సినిమాలు అంటూ సరదాగా చెప్పుకొచ్చిందట. అంతేకాదు ఆ వెబ్ సిరీస్ ను రిజెక్ట్ చేసి పక్కన పడేసిందట. ఆ టైంలో స్టార్ ప్రొడ్యూసర్స్.. పూజ హెగ్డే కి బాగా పొగరు, బలిసింది.. వెబ్ సిరీస్ అంటే అంత చులకనా.. స్టార్ హీరోయిన్ సమంత, బిగ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. వాళ్లకు లేని డిమాండ్ ఈ పూజకా.. అంటూ తిట్టుకున్నారట. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ వెబ్ సిరీస్ లో కూడా పూజ హెగ్డేకి ఆఫర్లు ఇవ్వట్లేదట. అంతలా పూజా గ్రాఫ్ పడిపోయింది. ఇక పూజ పాప తన గ్రాఫ్ ని ఎలా పెంచుకుంటుందో.. ఐరన్ లెగ్ అనే ముద్రను ఎలా చెరిపేసుకుంటుందో చూడాలి.