Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్డె తెలుగు తెరకు పరిచయమైనప్పుడు మొదట్లో ఎన్నో పరాజయాలు ఎదుర్కొన్న తర్వాత తనపై తాను నమ్మకం ఉంచుకొని అంచెలంచెలుగా ఎదిగి నేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న పూజా హెగ్డె ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీన విడుదల అవుతుండడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో భిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇందులో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపిస్తారు. అందుకే వ్యక్తిగత జీవితంలో మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా అంటే పూజా హెగ్డే జ్యోతిష్యశాస్త్రం తాను నమ్ముతానని ఎన్నోసార్లు జ్యోతిష్యం కూడా చెప్పించుకున్నానని తెలిపింది.
పూర్వీకులు ఏ సాధనాలు లేకున్నా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన ఊహాశక్తిని ప్రదర్శించారు. అయితే మనం దానిని నమ్మాలా లేదా అనేది మన వ్యక్తిగత విషయం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఇక ప్రభాస్ ని ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగారు కదా అనే విషయం గురించి ప్రశ్నించగా అందుకు పూజా హెగ్డే సమాధానం చెబుతూ ఎంతో అందం, అభినయం ఉన్న ప్రభాస్ ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రతి ఒక్కరూ అడుగుతుంటారు. అందుకే తాను కూడా అడిగానని.. పూజా హెగ్డే ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేసింది.