Pokiri Movie Hit : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రిన్స్‌గా సినిమా కెరీర్‌ను మొదలుపెట్టి తన తండ్రిలాగే సూపర్ స్టార్ అయ్యారు. మహేష్ బాబు నటనలోనూ తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నారు. కనుకనే ఆయన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక మహేష్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సినిమాను అయితే ప్రేక్షకులు ఇప్పటికీ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఈ మూవీ అంతలా హిట్ అయింది. 2006లో యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీలో మహేష్‌కు జోడీగా ఇలియానా నటించింది. అప్పటికే దేవదాసు సినిమాతో హిట్ కొట్టిన ఈ భామ పోకిరితో రెండో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈమె వెనుదిరిగి చూడలేదు.
అటు మహేష్‌తోపాటు ఇటు ఇలియానా, పూరీ జగన్నాథ్‌లకు కూడా ఈ మూవీ మరో లైఫ్‌ను ఇచ్చిందని చెప్పవచ్చు. ఫ్లాప్‌లతో ఉన్న హీరో, దర్శకుడికి ఈ మూవీ మంచి బ్రేక్ ను ఇచ్చింది. అయితే పోకిరి సినిమాను చివరి వరకు చూస్తే గానీ అసలు ఏమీ అర్థం కాదు. అసలు అందులో కథ ఏముంది ? అన్న అభిప్రాయం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. అయితే పోకిరి సినిమా అంతటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవడం వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ జగన్నాథ్‌కు మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. అందుకనే ఆయన డైలాగ్స్ ఆ విధంగా రాసుకుంటారు. ఈ క్రమంలోనే హీరోను ఆ డైలాగ్‌లే ఎలివేట్ చేస్తాయి. సరిగ్గా పూరీ కూడా ఇదే సూత్రాన్ని పోకిరిలో పాటించాడు. ముఖ్యంగా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండు గాడు.. అని చెప్పే డైలాగ్ అదుర్స్. దీనికి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ అదుర్స్. ఇక ఇలాంటి సీన్లు ఈ మూవీలో చాలానే ఉంటాయి. ఫలానా సీన్ లో అలా జరుగుతుంది కాబోలు అని ప్రేక్షకులు ఊహించేలోపే వారికి షాక్ ఇచ్చేలా సీన్ మారుతుంది. వారు అనుకున్న విధంగా సీన్ ఉండదు. ఇది ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇలాంటి సీన్స్ పోకిరిలో చాలానే ఉన్నాయి. కనుకనే ప్రేక్షకులకు ఈ మూవీ థ్రిల్‌ను అందించింది. హిట్ అయింది.
ఇక పోకిరి సినిమాలో సీన్లు అన్నీ చాలా వేగంగా ముందుకు సాగుతుంటాయి. ఎక్కడా బోర్ ఫీలింగ్ రాదు. తరువాత ఏం జరుగుతుందో అనే టెన్షన్‌ను క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అలాగే ఆలీ, బ్రహ్మానందంల కామెడీ ట్రాక్ ఓ వైపు సాగుతుంటుంది. దీంతో ప్రేక్షకులు మధ్య మధ్యలో రిలీఫ్ ఫీలవుతారు. ఇంకో వైపు హీరో యాక్షన్ సీన్లు.. చివరకు హీరో రౌడీ కాదు.. పోలీస్.. అండర్‌కవర్ కాప్.. అని రివీల్ చేస్తారు. ఇది ప్రేక్షకులకు ఊహించని సర్‌ప్రైజ్. ఇలా ఎన్నో అంశాలు పోకిరిలో ఉన్నాయి. కనుకనే ఈ మూవీ హిట్ అయింది.
అయితే ఇలాంటి సినిమాలను ఒకసారి తీస్తేనే ప్రేక్షకులు చూస్తారు. ఈ విధమైన కథతో ఇంకా సినిమాలు తీస్తే నడవవు. ఎందుకంటే అప్పటికే ఈ తరహా సినిమా చూసి ఉంటారు కనుక నెక్ట్స్ ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఈజీగా చెప్పేస్తారు. కనుక దర్శకుడు సక్సెస్ కోసం ఏ ఫార్ములాను వాడినా.. అది ఆ సినిమాకే. తరువాతి సినిమాకు ఇంకో కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు రావల్సిందే. లేదంటే.. పాత ధోరణిలోనే సినిమా తీస్తే ప్రేక్షకులకు కచ్చితంగా బోర్ కొడుతుంది. అప్పుడు సినిమా చూడాలన్న ఆసక్తి ఉండదు. దీంతో మూవీ నిరాశ పరిచి ఫ్లాప్ అవుతుంది. కనుక ఎప్పటికప్పుడు భిన్న కాన్సెప్ట్‌తో సినిమాలను తీసేలా దర్శకులు ప్లాన్ చేసుకోవాలి. అది పోకిరికి వర్కవుట్ అయిందని చెప్పవచ్చు. కనుకనే ఆ మూవీ హిట్ అయింది. ప్రేక్షకులు మెచ్చారు. కానీ తరువాత పూరీ అలాంటి సినిమాలు తీయలేకపోయారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…