Pedarayudu Movie : మోహ‌న్ బాబు పెద‌రాయుడు మూవీ దెబ్బ‌కు.. చిత్త‌యిపోయిన చిరంజీవి సినిమా.. ఏదంటే..?

Pedarayudu Movie : పెదరాయుడు మూవీ మోహన్ బాబు నట జీవితంలో అతి పెద్ద సక్సెస్ అనే చెప్పాలి. ఈ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్స్ తిరగరాసింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ఈజీగా పెదరాయుడు మూవీ క్రాస్ చేసింది. పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు పెదరాయుడుగా, ఆయన తమ్ముడు రాజాగా ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో భార్య భర్తల బంధం, అన్నదమ్ముల అనుబంధం, తల్లి తండ్రులతో కొడుకల అనుబంధాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు.

1994లో త‌మిళంలో నాట్ట‌మై అనే సినిమాలో విజయ్ కుమార్ వంటి సాధారణ నటుడు చేసిన పాత్రను తెలుగులో సూపర్ స్టార్ రజినీకాంత్ మోహన్ బాబుతో ఉన్న స్నేహం కారణంగా నటించారు. అంతేకాదు తమిళంలో హిట్టైన నాట్ట‌మై చిత్రాన్ని తెలుగులో తీయమని మోహన్ బాబుకు సలహా ఇచ్చింది కూడా రజనీకాంత్ కావడం విశేషం. స్నేహితుడి మాట కాద‌న‌లేక పెదరాయుడు సినిమా కోసం రీమేక్‌లో సిద్ధ‌హ‌స్తుడైన ర‌విరాజా పినిశెట్టిని ద‌ర్శ‌కుడిగా తీసుకున్నారు. అప్ప‌టికే వ‌రుస ప్లాప్‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న మోహ‌న్‌బాబు లైప్ అండ్ డెత్ గేమ్‌లాగా త‌న సొంత బ్యాన‌ర్ మీదే ఈ సినిమా తీయాల‌ని నిర్ణయించుకున్నారు మోహ‌న్‌బాబు. ఈ సినిమాలో నటించినందకు అప్పటిలో రజినీకాంత్ కూడా ఎలాంటి పారితోషకం తీసుకోలేదు.

Pedarayudu Movie

15 జూన్ 1995లో పెదరాయుడు విడుదలై ఘన విజయం సాధించింది. పెద‌రాయుడుగా మోహ‌న్ బాబు వేసిన ముద్ర అప్ప‌ట్లో చాలా కాలం వేరే హీరోలు అలాంటి పాత్ర‌లు మ‌రికొన్ని వేసినా అంత‌గా ఆక‌ట్టుకోలేదు. మోహ‌న్‌బాబు అంత గొప్ప‌గా ఆ పాత్ర‌లో జీవించారు. ఈ సినిమాలో పాపారాయుడు పాత్రలో రజినీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ప్లాష్‌బాక్‌లో 20 నిమిషాల పాటు పాపారాయుడు పాత్ర‌లో చెల‌రేగిపోయిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఒక ఎత్తు. ర‌జీనికాంత్ ఎపిసోడ్ కోస‌మే ఒక‌టికి ప‌ది సార్లు సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు.

పెదరాయుడు విడుదలైన అదే రోజు మెగాస్టార్ చిరంజీవి బిగ్‌బాస్ మూవీ కూడా విడుద‌ల అయింది. మెగాస్టార్ దెబ్బ‌కు పెద‌రాయుడు నిల‌బ‌డుతుందా అనుకున్నారు అప్పటిలో అందరూ. కానీ మొద‌టి వారంలోనే సీన్ రివ‌ర్స్‌ అయింది. రెండు సినిమాలు విడుదలై రెండు, మూడు రోజులు గ‌డిచాయి. క్ర‌మ క్ర‌మంగా సినిమా హాళ్లు బిగ్‌బాస్‌కు త‌గ్గి పెద‌రాయుడుకి క్యూలు పెరిగాయి. ముఖ్యంగా థియేట‌ర్లు టికెట్ల కోసం జ‌నాలు కొట్టుకున్నారు. పెదరాయుడు ప్రింట్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. డ‌బ్బు లెక్క‌పెట్టుకోవ‌డానికి మిష‌న్లు కావాలి అనేంత‌గా క‌లెక్ష‌న్లు వర్షం కురిపించింది. పెదరాయుడు సినిమా ధాటిని త‌ట్టుకోలేక‌ చిరంజీవి బిగ్‌బాస్ సినిమా జెండా ఎత్తేసింది. అప్ప‌టివరకు ఘ‌రానా మొగుడు సినిమాపై ఉన్న రికార్డుల‌న్నింటీనీ పెద‌రాయుడు తిర‌గ‌రాసింది. 39 కేంద్రాల్లో శ‌త‌దినోత్స‌వం జరుపుకొని ఆల్టైమ్ రికార్డులను బ్రేక్ చేసింది పెదరాయుడు చిత్రం.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM