Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగాడు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించారు. కెరీర్ లో ఇంత సక్సెస్ చూసినా కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నా కూడా ఆయన ఎన్నడూ ఒకరిని గట్టిగా విమర్శించడం, తిట్టడంలాంటివి చేయలేదు. ఇక మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎందరో కలలుగంటారు. ఇక హీరోయిన్ల సంగతి చెప్పక్కర్లేదు. అయితే చిరంజీవి లైఫ్ లో ఇద్దరు హీరోయిన్లు మాత్రం చిరుతో వింతగా ప్రవర్తించారట.
సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు గారు నటి మాధవి గారి ప్రవర్తన గురించి ఆయన అనుభవాలను పంచుకున్నారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీ చిరంజీవికి ఒక మైలురాయి లాంటిది. ఇందులో హీరోయిన్ గా మాధవి గారు నటించారు. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన పున్నమినాగు కూడా సూపర్ హిట్. ఇప్పటికీ రగులుతోంది మొగలిపొద పాట వింటూనే ఉన్నాం.. అలాంటి ఈ హిట్ పెయిర్ కి చిన్నవివాదం ఉంది. నిజానికి చిరంజీవి గారు అప్పట్లో నటించిన హీరోయిన్స్ అందరితో ఇప్పటికీ తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆయన మాధవిగారితో నటించడానికి చాలా ఇబ్బంది పడేవారట.
దీని కారణం ఆయనతో మాధవి గారు డిస్టెన్స్ మెయిన్ టైన్ చేయడమే. మాధవి గారు సినిమాల్లో నటించాలి.. అగ్రతారగా ఎదగాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి రాలేదట. ఇక ఇంట్లో వాళ్ళు కుడా సినిమాల్లో ఎవరితోనైనా చనువుగా ఉంటే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, పెళ్లిలాంటివి ఇబ్బంది అవుతాయి అని ఆలోచించేవారట. అందువల్ల ఆమె సినిమా వాళ్లేవరితో ఎక్కువగా మాట్లాడేది కాదట. ఇక అలా చిరునే స్వయంగా.. నాతో మాట్లాడండి, క్లోజ్ గా ఉండండి సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ అపుడు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అంటూ చెప్పినా ఆమె దూరంగానే ఉండేవారట. దీంతో ఆమెతో నటించాలంటే నరకంగా ఉండేదని చిరంజీవి స్వయంగా చెప్పారని రామారావు గారు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…