Aadi Saikumar : ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పూత్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. కల్యాణ్ జి గోగణ తెరకెక్కిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. చాలా కాలంగా ఒక్క హిట్టు కోసం చూస్తున్న ఆది ఇప్పుడు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. కళ్యాణ్ గోగణ దర్శకత్వంలో తీస్ మార్ ఖాన్ అనే సినిమా చేస్తున్న ఆది ఇప్పుడు పాయల్ రాజ్ పూత్ తో బీచ్ లో రొమాన్స్ లో మునిగితేలుతున్నాడు.
చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా, ఈ పోస్టర్‌లో ఆది, పాయల్ సముద్ర తీరంలో కూర్చొని.. ఒకరినొకరు చూసుకుంటూ రొమాంటిక్‌గా కనిపించారు. ‘‘యాక్షన్ ప్రాధాన్యమున్న కథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. నాయకానాయికలపై ఓ రొమాంటిక్ గీతం తెరకెక్కిస్తున్న నేపథ్యంలో పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో పాయల్, ఆది చాలా కొత్తగా కనిపిస్తారు’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు ఆది సాయి కుమార్. ఇప్పుడు కూడా ఈయన మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి తీస్ మార్ ఖాన్. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరోవైపు పాయల్ కూడా మంచి హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…