
Payal Rajput : అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో గ్లామరస్ గా కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇలా పాయల్ నటించే బోల్డ్ పాత్రల ద్వారా ఈమెకు ఎంతో మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ బ్యూటీ ఇటు వెండితెరపై అటు వెబ్ సిరీస్ లో నటిస్తూ ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది.
గత ఏడాది అనగనగా ఒక అతిథి అనే సిరీస్ ద్వారా ఓటీటీకి పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమైంది. ఇందులో కూడా ఈ ముద్దుగుమ్మ బోల్డ్ పాత్రలో నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో పాయల్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఇందులో సౌరబ్ ధింగ్రా హీరోగా నటిస్తున్నారు.
ఎంతో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి ఆర్ఎక్స్ భామ అ మరోసారి ప్రేక్షకులను త్రీ రోజెస్ ద్వారా సందడి చేయడానికి సిద్ధమైందని తెలుస్తోంది.