Pawan Kalyan : సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు చేస్తున్న హడావుడి చూస్తుంటే.. కాదేదీ ట్రోలింగ్‌కి అనర్హం అనిపిస్తోంది. ఏ విషయమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ వస్తువైనా.. ఇలా ఏదైనా సరే.. ట్రోల్ చేయడానికి వెనుకాడటం లేదు.. అంతగా సోషల్ మీడియాని వారు వాడుతున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ వేసుకున్న టీ షర్ట్‌పై బీజేపీ శ్రేణులు ట్రోలింగ్‌కు దిగితే.. ప్రధాని మోడీ కాస్ట్యూమ్స్ మార్చే తీరుపై కాంగ్రెస్, ఇతర పార్టీలు ట్రోలింగ్ నడిపాయి. సరే, అవి పాలిటిక్స్ అనుకుంటే.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, అందులోని వ్యక్తుల గురించి.. సోషల్ మీడియాలో నిత్యం ఏదో విధంగా ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ పవన్ కళ్యాణ్ వెరీ లగ్జరీ అనే ట్రోలింగ్ నడుస్తుంది.
పొలిటికల్ మీటింగ్‌లలో పవన్ కళ్యాణ్ నేత వస్త్రాలు ధరించి.. రబ్బరు చెప్పులు వేసుకుని.. మట్టిపిడతల్లో పెరుగు అన్నం తింటూ చాలా సింపుల్‌గా కనిపిస్తారే.. మరి ఈ లగ్జరీ లైఫ్ ఏంటి ? అంటే.. అదే మరి పాలిట్రిక్స్ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆయన రెడ్ టీ షర్ట్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందులో పవన్ కళ్యాణ్ చేతికి వాచ్ ఉంది.. అలాగే ఎదురుగా షూ కూడా ఉంది. దీంతో ఆ వాచ్ ఖరీదు ఎంత ? ఆయన వేసుకున్న షూ ఖరీదు ఎంత అంటూ వెతుకులాట మొదలుపెట్టారు. ఆ పోస్టర్‌లో కనిపించే వాచ్ ఖరీదు దాదాపు 14 లక్షల 37 వేలు. ఇక షూస్ ధర అయితే 10 లక్షలు అని ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. దీని ధర 119.94 యూరోలుగా ఉంది.

వాటిని ఇండియన్ కరెన్సీలో చూస్తే పది లక్షలు అవుతుంది. అయితే డచ్ లాంగ్వేజ్ ప్రకారం ఫుల్ స్టాప్‌ను కామాగా రాస్తుంటారు. నిజానికి ఆ షూ ధర దాదాపు 119 యూరోస్. ఆ లెక్కన చూస్తే పవన్ కళ్యాణ్ వేసుకున్న షూ ధర రూ.9,600 మాత్రమే కానీ.. పది లక్షలు అంటూ ట్రోల్ చేస్తున్నాయి. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో మా హీరో వేసుకున్న షూ ఎంతో తెలుసా ? రూ.10 లక్షలు అని గర్వంగా చెప్తుంటే.. మీ హీరో ఈఎంఐలు కట్టలేక కార్లు అమ్మేశానని అంటాడు అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ కామెంట్స్‌కు, ట్రోలింగ్‌కు కొందరు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ.. ఆయన ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలియదా. షూస్, వాచ్ అంటూ కూడా ఆయనపై ట్రోలింగ్‌కు దిగుతున్నారేంట్రా ? మీ దుంపలు పిలకెయ్య.. ఏం పోయే కాలం రా మీకు.. అంటూ పవన్ కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.