Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఆ తరువాత తన సొంత శ్రమ, కష్టంతో ఒక్కో మెట్టు ఎదిగారు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సొంత టాలెంట్, లక్ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఎవరూ రాణించలేరు. పవన్ టాలెంట్‌తోనే బాగా ఎదిగారని చెప్పవచ్చు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. అలాగే హరిహర వీరమల్లు షూటింగ్‌లో పాల్గొననున్నారు.
ఇక ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే కొన్ని బలహీనతలు, లోపాలు ఉంటాయి. పవన్ కు కూడా అలాంటివి ఉన్నాయి. పవన్‌కు ఎలాంటి బలహీనత లేదు. కానీ ఒక్క లోపం మాత్రం ఉందట. దాని వల్లనే ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారట. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా చెప్పారు. అప్పట్లో ఓ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ తనకు ఒక లోపం ఉందని చెప్పి అందరికీ షాకిచ్చారు. అదేమిటంటే.. తనకు ఉన్న లోపం సిగ్గు అని చెప్పారు. తనకు బాగా సిగ్గని.. అందుకనే కొన్నిసార్లు ఎవరినైనా అడగాలనుకుంది అడగలేకపోతానని చెప్పారు.
సిగ్గు వల్ల సినిమాల్లో నటించడం కూడా ఇబ్బందిగానే ఉంటుందని పవన్ తెలిపారు. అయితే పవన్ అప్పట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ హరిహర వీరమల్లుతోపాటు వినోదయ సీతమ్‌లో చేయనున్నారు. ఆ తరువాత పూర్తి సమయాన్ని రాజకీయాల కోసమే కేటాయించనున్నారు. ఈ క్రమంలోనే పవన్ వచ్చే ఏడాదిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బస్సు యాత్ర చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…