Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల భీమ్లా నాయక్ చిత్రంతో పలకరించిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా హరిహర వీర మల్లు చిత్ర మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకున్నారు. పవన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత కొద్ది రోజలుగా ఈ మూవీ షూటింగ్‌తో పవన్ బిజీగా ఉన్నారు.
విరామం సమయంలో పవన్ కళ్యాణ్ కునుకు తీస్తూ కనిపించారు. పవన్ గన్ పట్టుకుని చిన్న పిల్లాడిలా నిద్రిస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత బిజీ షెడ్యూల్ వల్ల సెట్స్‌లో టైం దొరకినప్పుడు ఇలా పడుకుంటున్నారేమో అని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. హరి హర వీర మల్లు అనేది యాక్షన్ డ్రామా. ఇందులో పవన్ గజదొంగగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. జాక్వెలిన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది.
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను ఓ వార్ సీన్ తో తిరిగి ప్రారంభించారు. అందుకోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. స్టంట్ మాస్టర్స్ నేతృత్వంలో ఫైట్ సీన్స్ కోసం వర్కౌట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ మరో చిత్రంలో నటించనున్నారు. ఆ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…