Acharya Movie Review : చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. నేడు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో కొరటాల శివ రూపొందించిన ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురు చూడగా.. ఆ క్షణం రానే వచ్చింది. ఇప్పటికే యూఎస్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడడంతో ఆచార్య రివ్యూలు వచ్చేస్తున్నాయి. చిత్ర కథ విషయానికి వస్తే..
ధర్మస్థలి గురుకులం సంరక్షకుడిగా సిద్ధ (రామ్ చరణ్) వ్యవహరిస్తూ ఉంటాడు. స్థానికులకు రక్షణగా ఉంటూ.. వారికి అండగా ఉంటాడు. అయితే ధర్మస్థలి పై బసవ(సోనూసూద్) కన్నుపడుతుంది. ధర్మస్థలిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అందుకు అడ్డుగా ఉన్న సిద్ధను తప్పించాలని భావిస్తాడు బసవ. అనూహ్య కారణాల వల్ల సిద్ధ ధర్మస్థలిని వదిలేస్తాడు. ఆ సమయంలో ధర్మస్థలి చిక్కుల్లో పడుతుంది. అప్పుడు ఆచార్య వచ్చి సమస్యలను చక్కబెడతాడు. అసలు ఆచార్యకి, సిద్ధకి సంబంధం ఏమిటి ? బసవరాజు నుండి ధర్మస్థలిని ఆచార్య ఎలా కాపాడాడు.. అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సుదీర్ఘమైన నటనా అనుభవాన్ని ఆచార్య సినిమాలో కూడా చూపించారు. ఈ వయసులో కూడా డాన్సులు, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన కనిపించిన తీరు నిజంగా అభినందనీయం. రామ్ చరణ్ పాత్ర పరిధి తక్కువగానే ఉన్నా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. తండ్రితో కలిసి నటించిన సన్నివేశాల్లో పోటీపడి మరీ నటించాడు అనిపించింది. ఇక పూజా హెగ్డె చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది. సంగీత పాత్ర పరిమితంగా ఉన్నా ఆకట్టుకుంది. మొత్తంగా సినిమాలో కనిపించిన నటీ నటులు వారి వారి పాత్రల పరిధిలలో నటించారు.
సినిమాకు మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం అంతగా ఇవ్వలేకపోయారు. కొరటాల శివ ఆయన నుండి బెస్ట్ ఔట్ పుట్ ను రాబట్టుకోలేక పోయారు. కొరటాల కాస్త పట్టు కోల్పోయినట్టుగా అనిపిస్తోంది. కొరటాల శివ కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. ఎడిటింగ్ విషయంలో చిన్న చిన్న తప్పులు ఉన్నా మొత్తంగా ఫర్వాలేదు అన్నట్లుగా ఉంది. ఇక చిరు, చరణ్ ల మధ్య ఉన్న సన్నివేశాలు మెగా ఫ్యాన్స్ కు మంచి వినోదాన్ని అందిస్తాయనే చెప్పాలి. మొత్తంగా చూస్తే సీరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకునేవారు ఒకసారి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…