Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పోసాని స్పందించారు. పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాకు కేవలం రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు చెప్పడంపై పోసాని ఖండించారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని, కానీ కేవలం రూ.10 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నాడని, అదే కనుక నిజమైతే తాను రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానని, తనకు నాలుగు సినిమాలకు సంతకం చేయమనండి.. అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పోసాని తీవ్రంగా స్పందించారు.
పవన్ కళ్యాణ్ తన సినిమాలకు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోలేదని నిరూపిస్తే.. నన్ను చెంప దెబ్బ కొట్టండి అంటూ పోసాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏకంగా వేయి రూపాయల వరకు టికెట్లు పెట్టి మధ్య తరగతి, సామాన్యులను హింసించడమే కదా అంటూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.