Watch Video : గులాబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. అనేక చోట్ల కొందరు గల్లంతయ్యారు. ఇక మహారాష్ట్రలో ఓ చోట ప్రయాణికులు ఉన్న బస్సు నదిలో కొట్టుకుపోయింది.

మహారాష్ట్రలోని యవత్‌మల్ జిల్లా ఉమర్‌ఖేడ్ తాలూకాలో ఉన్న ఓ నదిలో 20 మందితో ప్రయాణిస్తున్న బస్సు కొట్టుకుపోయింది. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ చూస్తుండగానే బస్సు నదిలో కొట్టుకుపోయింది.
@uddhavthackeray @DGPMaharashtra @MantralayaRoom @mpo_hp_umarkhed pic.twitter.com/VQRWP8XayG
— Dr Shiv Gandhi (@DrShivGandhi1) September 28, 2021
కాగా గులాబ్ తుఫాన్ ఇప్పటికే బలహీన పడి అల్ప పీడనంగా మారింది. దీంతో మహారాష్ట్రలో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముంబైలోని రీజినల్ మిటరలాజికల్ సెంటర్ వెల్లడించింది.