Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రంలో నటించిన విషయం విదితమే. ఈ మూవీ సంక్రాంతికే విడుదల కావల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీని త్వరలో విడుదల చేయనున్నారు. ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారంతోపాటు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ పెంపు, కరోనా.. వంటి సమస్యలు ఉండడంతో.. భీమ్లా నాయక్‌పై మేకర్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే అన్ని సమస్యలను అధిగమించి త్వరలోనే ఈ మూవీ విడుదలవుతుందని ఆశిస్తున్నారు.

ఇక పవన్ తన తదుపరి చిత్రం హరి హర వీర మల్లు షూటింగ్‌ను ప్రారంభించేశారు. తాజాగా ఆయన సెట్స్‌ను సందర్శించారు. ఈ క్రమంలోనే ఆయన మరో రెండు వారాల్లో షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. అయితే అప్పటి వరకు ఆయన లుక్ ఇంకా పూర్తిగా మార్చేస్తారని తెలుస్తోంది. హరి హర వీర మల్లు సినిమా కోసం ఆయన తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకుంటారని సమాచారం. ఇప్పటికే ఆయన తాజాగా ఓ కార్యక్రమంలో పొడవైన జుట్టుతో కనిపించారు. అలాగే గడ్డం కూడా ట్రిమ్ చేశారు. దీంతో ఆయన కొత్త లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ మూవీతోపాటు ఆయన త్వరలో భవదీయుడు భగత్‌సింగ్ చిత్రంలోనూ నటించనున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఓ తమిళ రీమేక్ చేయనున్నారు. అందులో పవన్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఆయనది చాలా పవర్ ఫుల్ పాత్రగా ఉంటుందని సమాచారం.