Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. కానీ అప్పట్లో శివ సినిమాతో టాలీవుడ్ గతినే మార్చేశాడు. శివ వచ్చి పాతికేళ్లు అయినా ఇంకా దాని గురించే ఇప్పటిటీ మాట్లాడుకుంటుంటారు. అప్పటి వరకు చూడని యాక్షన్, స్క్రీన్ ప్లే, టేకింగ్, మేకింగ్ శివతో పరిచయం అయ్యాయి. దీంతో ఆర్జీవీ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. దీంతో అటు బాలీవుడ్ కు వెళ్లి రంగీలా, సత్య వంటి సూపర్ హిట్లు తీసి దేశం మొత్తం తన వైపు చూసేలా చేశాడు. ప్రస్తుతం వర్మ సినిమాలు నాసిరకంగా ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు వర్మ తీసిన చిత్రాలన్నీ కల్ట్ క్లాసిక్‌గానే మిగిలాయి.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే అని వర్మకు తెలుసో తెలియదో.. తెలిసినా తెలియనట్టు నటిస్తున్నాడో తెలీదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్మ మీద ఆగ్రహంతో ఉన్నారు. వర్మ కావాలనే చేస్తోన్నాడంటూ మండిపడుతున్నారు. పవన్ బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా షేక్ అయిపోయిన విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ బర్త్ డే అని తెలిసినా కూడా ట్వీట్లు వేయడం లేదు. కానీ కన్నడ హీరో కిచ్చా సుదీప్ మీద ట్వీట్ వేశాడు. విషెస్ చెప్పాడు అంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

వన్ అండ్ ఓన్లీ స్టార్, యాక్టర్ అంటూ ఇలా సుదీప్ మీద ప్రశంసలు కురిపిస్తూ వర్మ ట్వీట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయినా నీ దగ్గరి నుంచి ఇంత కంటే మేం ఏమీ ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయలేంలే.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. వర్మ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. వర్మ తెలిసి కూడా తెలియనట్టు ఇలా ట్వీట్లు వేసిన సందర్భాలు ఇంతకు ముందు కూడా ఉన్నాయ్. కావాలనే ఫ్యాన్స్ ని రెచ్చగొట్టాడు వర్మ అని నెటిజన్లు అంటున్నారు.