Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల పరంగా ఎంత పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. ఆయన నటన అద్భుతం. అందుకనే ఆయన సినిమాలంటే అభిమానులు అంతగా ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక ఆయన కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్యలు కూడా తండ్రిని మించిన వారిగా తమ ప్రతిభను చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కుమార్తె ఆద్యకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పవన్ కుమార్తె ఆద్య గిటార్ వాయిస్తూ పాట పాడుతోంది. ఈ వీడియోను రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆద్య టాలెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఆద్యలో ఇంతటి టాలెంట్ దాగి ఉందా.. అని ఆశ్చర్యపోతున్నారు. పవన్ కుమార్తెనా, మజాకా.. తండ్రిని మించిన తనయ.. అంటూ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
ఇక అకీరానందన్ కూడా తక్కువేమీ కాదు. అతనికి కర్రసాములో ప్రావీణ్యం ఉంది. ఇటీవలే అతను కర్రసాము చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో అకీరానందన్ టాలెంట్‌కు ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు. అలాగే అతను కూడా పియానోను అద్భుతంగా వాయించగలడు. బాస్కెట్ బాల్ కూడా బ్రహ్మాండంగా ఆడుతాడు. ఈ క్రమంలోనే అకీరా నందన్ త్వరగా సినిమాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కాగా రేణు దేశాయ్ ఇటీవల కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంది. దీంతో ఆమెకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందారు. తాను బాగానే ఉన్నానని.. తనకు ఏమీ కాలేదని.. తాజాగా ఆమె అప్‌డేట్ ఇచ్చారు. ఇక తమ పిల్లలకు చెందిన ఫొటోలు, వీడియోలను రేణు దేశాయ్ ఎప్పుడూ షేర్ చేస్తుంటారు.