Cars : పవర్ స్టార్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ మధ్య కాలంలో బాగా బిజీ అయ్యారు. ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ ఆపేశారు. అందులో పవన్ చెప్పినట్లుగా దర్శకుడు క్రిష్ మార్పులు చేయలేదట. దీంతో ఆ మార్పులు చేసేవరకు తాను సెట్‌కు రానని పవన్ చెప్పేశారట. దీంతో షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఎన్నికలకు ఇంకో 2 ఏళ్లు మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచే అందుకు గాను పవన్ కసరత్తు ప్రారంభించారు. ఈసారి ఎన్నికల్లో ఆయన టీడీపీ లేదా బీజేపీతో కలసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా 8 కార్లను ఒకేసారి కొన్నారు. అవన్నీ ఒక్కే బ్రాండ్‌కు చెందిన ఒకే మోడల్ కార్లు కావడం విశేషం. అక్టోబర్ 5 నుంచి వరుసగా 3 లేదా 6 నెలల పాటు పాదయాత్ర చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. కనుకనే తన పాదయాత్రలో సిబ్బందికి గాను ఈ కార్లు ఉపయోగపడతాయని పవన్ భావిస్తున్నారు. ఇక రెండు రాష్ట్రాల్లో లేదా ఏపీలో ఆయన పాదయాత్ర జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కోసం పవన్ ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకనే ఆయన ఒకేసారి 8 కార్లను కొని తగ్గేదేలే అంటున్నారు.

ఇక పవన్ రోడ్ షోలలో భాగంగా వీలు కుదిరితే హరిహర వీరమల్లు షూటింగ్ చేస్తారు. లేకపోతే లేదు. కానీ అప్పటిలోగా సాయిధరమ్ తేజ్‌తో కలిసి వినోదయ సీతమ్ అనే రీమేక్‌లో నటించనున్నారు. ఇందుకు గాను పవన్ 20 రోజుల కాల్‌షీట్స్ ఇచ్చారు. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న భవదీయుడు భగత్‌సింగ్, సురేందర్ రెడ్డి సినిమాలపై మాత్రం క్లారిటీ లేదు. ఇవి 2024 ఎన్నికల తరువాతే పట్టాలెక్కుతాయని తెలుస్తోంది. మొత్తానికి పవన్ ఎన్నికల కోసం 2 ఏళ్ల ముందు నుంచే సన్నద్ధమవుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.