Pavitra Lokesh : గత కొద్ది రోజుల క్రితం నరేష్, పవిత్ర లోకేష్‌ల వ్యవహారం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ నానా హంగామా చేశారు. అయితే వీరి గురించి ముందుగానే పుకార్లు వచ్చాయి. వీరు కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. వార్తలు వచ్చాయి. అందుకనే మహాబలేశ్వరం కూడా వెళ్లారని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే అవన్నీ నిజమే అయ్యాయి. పవిత్ర లోకేష్, నరేష్ ఇద్దరూ తమ మధ్య ఉన్న సంబంధాన్ని బయట పెట్టక తప్పలేదు.
మైసూర్‌లోని ఓ హోటల్‌లో నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ నరేష్ భార్య రమ్యకు పట్టుబడ్డారు. దీంతో ఆ ఇద్దరూ నిజాన్ని అంగీకరించాల్సి వచ్చింది. తాము పెళ్లి కూడా చేసుకోబోతున్నామని వారు కన్‌ఫామ్ చేశారు. దీంతో ఈ విషయంపై దుమారం చెలరేగింది. నరేష్ ఎంతో బుద్ధిమంతుడిలా ఉంటూ ఇలా చేశాడేంటి.. అని అందరూ ఆయనను విమర్శించారు. సినిమా ఇండస్ట్రీ ఆయనను దూరం పెట్టేసింది. ఆయనకు ఎవరూ సపోర్ట్ ఇవ్వలేదు.

ఇక రమ్య రఘుపతితో తాను ఎప్పుడో విడిపోయానని నరేష్ చెప్పగా.. ఆమె మాత్రం తనను బెదిరించి విడాకులు అడుగుతున్నారని ఆరోపణలు చేసింది. ఇక పవిత్ర లోకేష్ అయితే.. నరేష్, తాను పెళ్లి చేసుకోబోతున్నామని.. తమకు అందరూ సపోర్ట్‌నివ్వాలని కోరింది. దీంతో వీరి వార్తలు సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేశాయి. అయితే వీరి వ్యవహారం మళ్లీ ఏమైందో తెలియదు కానీ.. వీరు మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
రవితేజ హీరోగా విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీలో నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ నటించారు. అయితే వీరు అందులో అన్నా చెల్లెళ్లుగా నటించారట. దీంతో అనేక థియేటర్లలో వీరు కనిపించగానే ప్రేక్షకులు ఈలలు వేస్తూ చప్పట్లు కొట్టారట. ఈ క్రమంలోనే అనేక థియేటర్లలో ఇలాగే జరిగిందని అంటున్నారు. దీంతో వీరు మరోమారు వార్తల్లో నిలిచారు. అయితే నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతిల వ్యవహారం మళ్లీ ఎలాంటి మలుపు తిరిగిందన్నది మాత్రం క్లారిటీ లేదు. త్వరలో ఏమైనా తెలుస్తుందేమో చూడాలి.