Pavithra Lokesh : సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల సంబంధం గురించిన వార్తలు కొద్ది రోజుల క్రితం వరకూ మీడియాలో హడావిడి చేయడం మనందరికీ తెలిసిందే. టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే విషయం చర్చకు రావడం జరిగింది. నరేష్ భార్య కూడా వారిద్దరూ కలిసి ఒక హోటల్ లో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రచ్చ చేయడం సంచలనం సృష్టించింది.
అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య ఉన్న సంబంధం వలన పవిత్ర లోకేష్ సినీ కెరీర్ చిక్కుల్లో పడిందని అనుకుంటున్నారు. చిత్ర పరిశ్రమలోని కొందరి ద్వారా అందిన సమాచారం ప్రకారం.. పవిత్ర లోకేష్ కి ఒక పెద్ద స్టార్ తో తీయనున్న భారీ బడ్జెట్ సినిమాలో నటించడానికి అవకాశం వచ్చిందని, అందులో ఆమె హీరో తల్లిగా చేయనుందని తెలిసింది. కానీ అంతలోనే ఆ స్టార్ హీరోకి పవిత్ర ఆ పాత్ర చేస్తున్నట్టుగా తెలిసి ఆమెను పక్కన పెట్టమని సూచించారని, దాంతో ఆ సినిమా డైరెక్టర్ పవిత్ర లోకేష్ ని బలవంతంగా ఆ చిత్రం నుండి తొలగించారని తెలిసింది.

అంతే కాకుండా గత నెలలో విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కూడా వీరిద్దరూ అన్నా చెల్లెల్లుగా నటించారు. అప్పుడు కూడా ఈమె ప్రేక్షకుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నరేష్ కూడా ఇదే విషయంలో పవిత్రను తన చెల్లి పాత్రలో కాకుండా తన భార్యగా నటించేలా తన పాత్రను మార్చాలని దర్శకుడిని అడగ్గా ఆయన అందుకు అంగీకరించలేదని తెలిసింది. ఇక ఆ సినిమా ఫలితం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మరో వైపు వారిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఇదివరకు కూడా వీరు వివిధ వేదికలపై కలిసి కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీటన్నింటి వలన పవిత్ర లోకేష్ కి సినిమా అవకాశాలు రావడం కూడా కష్టంగా మారుతోందని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.