Parvati Melton : 2005వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవ కట్టా దర్శకత్వం వహించిన వెన్నెల చిత్రంతో హీరో రాజాతో కలిసి జంటగా నటించిన పార్వతీమెల్టన్ తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో పార్వతీమెల్టన్ కి అంత గుర్తింపు రాకపోయినా పవన్ కళ్యాణ్ నటించిన జల్సాలో జెన్నిఫర్ లోఫెజ్ స్కెచ్ గీసినట్టుందే అంటూ ఆడి పాడి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. దూకుడు లో మహేష్ తోపాటు పూవాయ్ పూవాయ్ అంటాడు ఆటో అప్పారావు అంటూ మహేష్ తో జతకట్టి అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లో ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఈ ఇంట్రడక్షన్ తో పార్వతి అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ.
అందం, అభినయం ఉన్న పార్వతి మెల్టన్ ను గ్లామర్ లుక్ లోనే ప్రేక్షుకులు ఇష్టపడేవారు. కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో వెన్నెల చిత్రం తర్వాత నటించిన గేమ్, అల్లరే అల్లరి తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఎంత క్రేజ్ వున్నా తెలుగు సినిమాల్లో హీరోయిన్ స్థాయిలో అవకాశాలు దక్కలేదు అని చెప్పవచ్చు. మళయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన హల్లో చిత్రంలో నటించి అలరించింది. ఈ సినిమా మళయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చివరగా 2012లో ఈ బ్యూటీ యమహో యమ అనే సినిమాలో కనిపించి ఆ తరువాత సినిమాలకు దూరం అయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పార్వతి మెల్టన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తన సినిమా కెరీర్ నాశనం కావడానికి ఇద్దరు దర్శకులు కారణమని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది. అయితే ఆ ఇద్దరు దర్శకుల పేర్లు మాత్రం ఆమె బయటకు వ్యక్తం చేయలేదు. అంతే కాకుండా 2013లో తాను శంసులాలానిని వివాహం చేసుకున్నట్టు తెలియజేసింది. ప్రస్తుతం భర్తతో కలిసి ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ జీవనం సాగిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…