Malavika : ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్, నవీన్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం చాలా బాగుంది ఇప్పటికి అందరికీ గుర్తుండే ఉంటుంది. 2000 వ సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం అప్పటిలో సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది కన్నడ బ్యూటీ మాళవిక. ఆ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం సక్సెస్ తో మాళవికకు తెలుగులో మంచి ఆఫర్లే వచ్చాయి.
దీవించండి, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, నవ్వుతూ బతకలిరా, చంద్రముఖి వంటి హిట్ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది మాళవిక. అంతేకాదు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాళం భాషల్లో దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించింది. 42 ఏళ్ల ఈ కన్నడ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ కి సిద్ధం అవుతోంది. ఇటీవల మాళవిక ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
చాలా బాగుంది సినిమా షూటింగ్ టైంలో ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు తాను కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాను మాళవిక తెలిపింది. వెంటనే షూటింగ్ లో తనకు అంత కంఫర్ట్ గా లేదని చెప్పానని తెలిపింది. అలా చెప్పడంతో శ్రీకాంత్ వెంటనే షూటింగ్ నుంచి మధ్యలో వెళ్లిపోయారని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది.
అంతే కాకుండా ఈ సినిమాలో అత్యాచారం సన్నివేశం చేసినందుకు ఇప్పటికీ కూడా తాను డిస్ట్రబ్ అవుతానని చెప్పింది. బాలీవుడ్ లో కూడా సీయు ఎట్ 9 అనే సినిమాలో ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేసినందుకు ఆమె తల్లిదండ్రులు కోప్పడ్డారని చెప్పింది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ లో తెరకెక్కిన పుష్ప సినిమాను తాను చూశానని, సినిమాలో సమంత చేసిన పాట బాగా నచ్చిందని తెలియజేసింది. మాళవిక కూడా ఇలా స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం వస్తే తాను చేయడానికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…