OTT : ప్రస్తుతం ఓటీటీ వేదిక ప్రభావం చాలా ఉంది. ప్రేక్షకులు కూడా ఈ వేదికనే ఎంచుకుంటున్నారు. థియేటర్ లో విడుదలైన కొత్త సినిమాలు అన్ని కొన్ని రోజులకే స్ట్రీమ్ అవుతున్నాయి. ఒకప్పుడు థియేటర్లో సినిమా విడుదలైతే దాదాపు 100 నుంచి 150 రోజుల వరకు ఆడి.. ఆ తర్వాత కొన్ని నెలల గ్యాప్ తో టీవీలోకి వచ్చేవి. కానీ ఇప్పుడు అలా లేదు. ఏ సినిమా అయినా విడుదలైన 5 వారాల్లోకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం 2 నుంచి 3 వారాల్లోనే స్ట్రీమ్ అవుతాయి.
ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, వూట్ లాంటి ఓటీటీలు థియేట్రికల్ రిలీజ్ అయినా లేక డైరెక్ట్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కి రెడీగా ఉంటున్నాయి. ఈ వారంలో ఓటీటీ పలు టాప్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటంటే.. ఝాన్సీ: ఈ మూవీలో అంజలి, చాందిని చౌదరి కథానాయికలుగా నటించారు. దీన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇది ఈ నెల 27 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానుంది.
ఘోస్ట్: నాగార్జున ది ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 2వ తేదీ నుంచి ప్రసారం కానుంది. ఇండియన్ ప్రిడేటర్: ఇది నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ క్రైమ్ డ్రామా కోర్టు గదిలో జరిగిన హత్య చుట్టూ తిరుగుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందించారు. అక్టోబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇన్‌సైడ్ మ్యాన్: నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ షోలో డేవిడ్ టెన్నాంట్, స్టాన్లీ టుక్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది అక్టోబర్ 31 నుండి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…