Online Delivery : ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్‌లో అనేక రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్ లో ఏది ఆర్డర్ చేసినా అది నేరుగా మన ఇంటికే వస్తోంది. దీంతో షాపింగ్ చేయడం తగ్గించారు. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆర్డర్ చేసే వీలు ఉండడంతో ప్రతి చిన్న వస్తువును చాలా మంది ఆన్‌లైన్ లోనే ఆర్డర్ ఇస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో మనం ఇచ్చే ఆర్డర్‌కు బదులుగా ఏ సబ్బు బిళ్లనో, రాళ్లో వస్తే.. ఏం చేయాలి ? అంటే..
పంజాబ్‌కు చెందిన డోరా డెబి అనే యువతి అమెజాన్‌లో రూ.16,800 కు ఒక ఫోన్‌ను ఆర్డర్ చేసింది. అయితే ఆర్డర్ వచ్చింది కానీ అందులో ఫోన్ లేదు. సబ్బు ఉంది. దీంతో ఖంగు తిన్న ఆమె వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చింది.
అయితే వారు విచారణ చేశారు. కానీ తమ తప్పేమీ లేదని చెప్పారు. రీఫండ్ ఇవ్వడం కూడా కుదరదన్నారు. దీంతో ఆమె వినియోగదారుల ఫోరంలో కేసు వేసింది. ఫలితంగా ఫోరం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు అమెజాన్ అంగీకరించింది.
అయితే ఈ విధంగా ఎవరికైనా జరగవచ్చు. కనుక ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాక వస్తువు చేతికి వస్తే వెంటనే దాన్ని సీల్ తీయరాదు. జాగ్రత్తగా పరిశీలించాలి. సీల్ ఏమాత్రం చిరిగిపోయినట్లు అనుమానం వచ్చినా అక్కడే ఆ వస్తువును ఏ మొహమాటం లేకుండా ఇచ్చేయాలి. దీంతో మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…