Mano : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారిలో సింగర్ మనో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న మనో ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇలా తెరపై ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండే సింగర్ మనో జీవితంలో ఎంతో విషాదం చోటు చేసుకుంది.
సింగర్ మనో అసలు పేరు నాగుల్ మీరా. తన తాత పేరును తనకు పెట్టారు. అయితే మనోకి నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు అబ్బాయిలు, ఒక కుమార్తె. మనో పెద్దబ్బాయి చిన్న వయసులోనే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ క్రమంలోనే ఈ విషాద ఘటనను తలుచుకుని మనో నిత్యం ఎంతో మదనపడుతూ ఉంటారు.
ఇక మిగిలిన ఇద్దరు కొడుకులు కూడా ప్రస్తుతం మంచి కెరియర్ లో ఉన్నారు. ఒక కుమారుడు తమిళ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోగా, రెండో కుమారుడు త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక కూతురు మంచి గాయకురాలిగా స్థిరపడింది. ఇలా జీవితం ఎంతో సాఫీగా సాగిపోతున్నప్పటికీ తన కుమారుడి మరణం తనని కృంగదీసిందని ఇప్పటికీ మనో ఆ విషాద ఘటనను తలుచుకొని బాధపడుతుంటారు.