NTR : రాజ‌కీయాల్లోకి ఎంట్రీపై తేల్చేసిన ఎన్‌టీఆర్‌.. ఏమ‌న్నారంటే..?

NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న త‌న తాత పేరు నిలబెడుతూ స్టార్ హీరోగా ఎదుగుతూ అభిమానుల అంచనాలకు తగ్గకుండా తన నటనతో వారిని ఆనందింపజేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఫుల్‌గా కొన‌సాగుతున్నాడు. ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద కాసుల‌ వ‌ర్షం కురిపిస్తోంది. ఆర్ఆర్ఆర్‌లో ప్ర‌త్యేకించి ఎన్టీఆర్ యాక్టింగ్ కి అంద‌రూ ఫిదా అయిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ స‌క్సెస్ ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతున్న నేప‌థ్యంలో హిందీ మీడియాతో చిట్ చాట్ చేశాడు ఎన్టీఆర్. ఈ చిట్‌చాట్‌లో తార‌క్‌ను పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి ఓ రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించాడు.

NTR

ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ.. మీరు ఆర్ఆర్ఆర్ లో కొమరం భీం పాత్రలో నటించారు. కొమరం భీమ్ సోషల్ రిఫార్మర్ మాత్రమే కాదు రెబల్ లీడర్ కూడా. తన ప్రజల కోసం ఏమైనా చేసేందుకు కొమరం భీమ్ సిద్ధపడ్డారు. ఆ కోణంలో చూసుకుంటే మీరు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నారా ? అని ఎన్టీఆర్ ని ప్రశ్నించారు. ఈ క్ర‌మంలో యాక్టివ్ పాలిటిక్స్ గురించి మొట్టమొదటిసారి నోరువిప్పాడు. నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను. ఒక యాక్టర్ గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదట నుంచి దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను.

ఫ్యూచర్ అంటే ఐదేళ్లు తర్వాత, పదేళ్ల తరువాత ఉంద‌ని అనుకొనే మనిషిని కాను.. భవిష్యత్ అంటే నా నెక్స్ట్ సెకన్ ఏంటి అనేది ఆలోచించే మనిషిని. ప్రస్తుతం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. యాక్టింగ్ అనేది నాకు ఎనలేని సంతృప్తినిచ్చే పని. నేను అందులోనే ఉండాలనుకుంటున్నాను.. అని చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి అభిమానులకు నిరాశే ఎదురైంది. ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇప్ప‌ట్లో లేద‌ని అర్ధ‌మ‌వుతోంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM