NTR : సాధారణంగా సెలబ్రిటీలు అత్యంత విలాసవంతమైన కార్లనే ఉపయోగిస్తుంటారు. అవి రూ.కోట్లలో ధర కలిగి ఉంటాయి. అత్యంత అధునాతన ఫీచర్లను కలిగి ఉంటాయి. ఇక అలాంటి కార్లు మన దేశంలో లభించకపోతే భారీ ఎత్తున పన్ను చెల్లించి మరీ వాటిని దిగుమతి చేసుకుంటుంటారు. అయితే విలాసవంతమైన కార్లను వాడడంతో ఎన్‌టీఆర్ అందరికన్నా ముందే ఉంటారని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన దగ్గర అత్యంత ఖరీదు గల కార్లు బాగానే ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ తన తాత లాగే కార్లకు ఓ ప్రత్యేకమైన నంబర్‌నే ఉపయోగిస్తుంటారు.
సీనియర్ ఎన్టీఆర్ తన కార్లకు 9 అంకె ఉండే నంబర్లనే ఎంపిక చేసుకునేవారు. అంటే.. 9, 99, 999, 9999 ఇలా అన్నమాట. ఇక తన తాత పేరు పెట్టుకుని ఆయన అంశలోనే జన్మించాడు కనుక జూనియర్ ఎన్‌టీఆర్ కూడా తన తాత విశ్వాసాలనే నమ్ముతుంటారు. అందుకనే ఆయన కూడా 9 అంకె వచ్చేలా ఉండే నంబర్లనే తన కార్లను ఉపయోగిస్తుంటాడు. ఇక ఈ మధ్యే ఎన్‌టీఆర్ అత్యంత ఖరీదు పెట్టి లంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ కాప్సూల్ కార్‌ను కొన్నారు.
కాగా ఎన్టీఆర్ తాను కొన్న కొత్త కారుకు 9999 అనే నంబర్‌ను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఖైరతాబాద్ ఆర్‌టీఏ నుంచి టీఎస్09 ఎఫ్ఎస్ 9999 అనే నంబర్‌ను తన కారుకు పొందారు. ఇందుకు గాను ఆయన అప్పట్లోనే రూ.17 లక్షలు చెల్లించారు. అయితే ఫ్యాన్సీ నంబర్లను కార్లకు తీసుకునేందుకు చాలా మంది వాటిని ఆన్‌లైన్‌లో వెతుకుతుంటారు. అందుకనే ఎన్‌టీఆర్ తీసుకున్న నంబర్ వార్త మళ్లీ వైరల్ అవుతోంది. ఇక ప్రతి సారి ఇలా ఆర్‌టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించడం ద్వారా భారీ మొత్తంలో ఆదాయం పొందుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…