Nivetha Pethuraj : సినిమా ఇండస్ట్రీ అంటేనే అంత.. అందులో చాలా పోటీ ఉంటుంది. నటీనటులే కాదు. ఏ విభాగాన్ని తీసుకున్నా.. తీవ్రమైన పోటీ ఉంటుంది. కనుక అందులో నెగ్గుకు రావడం చాలా కష్టం. ముందుగా అవకాశాలు రావాలి. వచ్చినా వాటిల్లో సక్సెస్ అవ్వాలి. అప్పుడే ఆ ఇండస్ట్రీలో ఎవరైనా సరే తట్టుకుని నిలబడగలుగుతారు. లేదంటే స్టార్ హీరోల వారసులు అయినా.. డబ్బున్నా.. అవేవీ పెద్దగా పనికిరావు. ప్రేక్షకుల మన్ననలు పొందిన వారే ఈ ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు. అయితే ఇండస్ట్రీలో కేవలం కొద్ది అవకాశాలు మాత్రమే వచ్చి తరువాత తెరమరుగు అయిన వారు ఎందరో ఉన్నారు. కొందరైతే ఇంకా అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో నటి నివేతా పేతురాజ్ ఒకరు.
ఈ అమ్మడు పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కొందరు స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే చాన్సులను కొట్టేసింది. కానీ ఈమెకు లక్ కలసి రావడం లేదు. హిట్ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ నివేతా పేతురాజ్‌కు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. అయితే ఇదే విషయంపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాను హీరోయిన్‌గా కన్నా.. నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎక్కువ ఇష్టడతానని తెలియజేసింది. అయితే నటిగా కూడా అవకాశాలు రాకపోతే ఉద్యోగం చేసి అయినా జీవిస్తానని.. తనకు ఆ సత్తా ఉందని.. నివేతా పేతురాజ్ తెలియజేసింది. అయితే ఈమె ఇంత సడెన్‌గా ఇలాంటి మాటలు మాట్లాడడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

నివేతా పేతురాజ్ ఒక్కరే కాదు.. ఇలా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. వారు అవకాశాల కోసం సమయాన్ని, వయస్సును వృథా చేసుకుంటున్నారు. అలా కాకుండా అవకాశాలు రాకపోతే కనీసం ఉద్యోగం అయినా చేస్తానని.. నివేతా పేతురాజ్ చెబుతుండడం విశేషం. జీవితంపై ఎవరికైనా సరే అలాంటి ఓ క్లారిటీ ఉంటే ఏ రంగంలో అయినా సరే విజయాలు సాధిస్తారని ప్రముఖులు చెబుతున్నారు. మరి నివేతా పేతురాజ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.