Nithya Menon : తెలుగు సినీ ప్రేక్షకులకు నిత్య మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె టాలీవుడ్‌కు అలా మొదలైంది సినిమాతో పరిచయం అయింది. ఆ మూవీ హిట్ కావడంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ గ్లామర్ షోకు దూరంగా ఉండడం, ఆ తరువాత చేసిన చిత్రాలు ఫ్లాప్ అవడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయినప్పటికీ ఈమె దక్షిణ, ఉత్తరాది భాషల్లో సుమారుగా 50 కి పైగా చిత్రాల్లో నటించింది. పలు అవార్డులను కూడా పొందింది. బాలనటిగా నిత్య మీనన్ సినీ రంగంలో ప్రవేశించినా.. హీరోయిన్‌గా ఎదిగింది. ఇక ఈమె రీసెంట్‌గా భీమ్లా నాయక్ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది.
అయితే ఇప్పటికే సీనియర్ హీరోయిన్లు చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. కొందరు లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నిత్య మీనన్ కూడా సీక్రెట్‌గా ఓ స్టార్ హీరోతో లవ్ ట్రాక్ నడిపిస్తుందని తెలుస్తోంది. అతను ఒక మళయాళం స్టార్ నటుడు అట. ఈ క్రమంలోనే తరచూ వారు కలసి షికార్లకు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరు సహజీవనం కూడా చేస్తున్నట్లు సమాచారం. అయితే పెళ్లి ఇంకా అనుకోలేదు కానీ.. త్వరలోనే నిత్య మీనన్ అతనితో పెళ్లి పీటలు ఎక్కనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె పెళ్లికి సంబంధించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే నిత్య మీనన్ ప్రస్తుతం 19 (1)(ఎ), ఆరమ్ తిరుకల్పన అనే మళయాళ మూవీల్లో నటిస్తోంది. అలాగే తిరుచిత్రాంబళం అనే తమిళ మూవీ చేస్తోంది. తెలుగులో ఈమెకు అవకాశాలు లేవు. భీమ్లా నాయక్ ఈమె నటించిన చివరి తెలుగు సినిమా. అలాగే పలు తెలుగు టీవీ షోల్లోనూ ఈమె సందడి చేస్తోంది.