Nithiin : టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో నితిన్, షాలిని ఒకరు. కరోనా కాలంలో వివాహం చేసుకున్న ఈ జంట ప్రతి పండుగను సరదాగా జరుపుకుంటూ ఉంటారు. తాజగా దీపావళి వేడుకని కూడా సంతోషంగా జరుపుకున్నారు. అయితే మీరంతా హ్యపీగా, సేఫ్‌గా దీపావళి పండగ జరుపుకోండి అని పేర్కొన్న నితిన్ భార్య.. తాను మాత్రం అంత సేఫ్‌గా లేననే విషయాన్ని తెలియజేసింది. షాలిని అలా పేర్కొనడం వెనుక కారణం ఏంటనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది.
అందరు సెలబ్రిటీల మాదిరిగానే షాలిని, నితిన్ దంపతులు కూడా దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. నితిన్, షాలిని టపాకాయలు కాల్చుతూ కనిపించారు. అయితే దీపావళి సెలెబ్రేషన్స్ లో భాగంగా నితిన్ చిన్న పిల్లాడైపోయాడు. తన భార్య షాలినిని కాసేపు సరదాగా ఆటపట్టించాడు. బాణా సంచా కాల్చుకునే తుపాకీతో నితిన్ అల్లరి షురూ చేశాడు.
https://www.instagram.com/p/CV27uGtB9WA/?utm_source=ig_web_copy_link
తన భార్య వైపు తుపాకీ గురిపెట్టి టపా టపా అంటూ టపాకాయలు పేల్చాడు. ఆ సౌండ్ ను భరించలేక షాలిని గట్టిగా చెవులు మూసుకుంది. ఈ వీడియోని షాలిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అలా కామెంట్ పెట్టింది. ఈ వీడియోకి పలువురు సెలబ్స్ కామెంట్స్ పెట్టారు. ‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుముల ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ ఒలింపిక్స్‌లో మనకు గోల్డ్ మెడల్ గ్యారెంటీ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.