Niharika : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై నటుడు, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పోసాని వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోసానిపై పలు చోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే మరోవైపు పోసాని వ్యాఖ్యలపై మెగా డాటర్ నిహారిక సంచలన వ్యాఖ్యలు చేసింది.

Niharika : పోసానికి మెంటల్.. హాస్పిటల్‌లో చేర్పించాలి..
పవన్ కల్యాణ్ ను పోసాని తిట్టినందుకు గాను పోసానిపై నిహారిక ఫైర్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోసానికి పిచ్చి పట్టిందని, ఆయనను వెంటనే మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలని పేర్కొంది. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ ఆడవాళ్ల గురించి మాట్లాడలేదని నిహారిక తెలిపింది. కేవలం సీఎం జగన్ గురించి మాట్లాడినందుకే పోసాని అలా పవన్‌ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని తెలిపింది. అందుకని పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరింది.