Niharika Konidela : మెగా డాటర్ నిహారికకు ఒకప్పుడు మంచి పేరు ఉండేది. డ్రగ్స్ కేసు వ్యవహారంతో అదంతా గంగలో కలిపినట్టు అయింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో నిహారిక కొణిదెల కూడా ఉండడం.. పోలీస్ స్టేషన్ నుంచి నిహారిక బయటకొస్తున్న దృశ్యాలు మీడియాలో సర్క్యులేట్ అవుతుండటం.. అదే సమయంలో నిహారికపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరగడం మెగా అభిమానులని చాలా కలవరపరిచింది. ముఖ్యంగా నిహారికను టార్గెట్ చేస్తూ #DrugsQueenNiharika అనే హాష్ ట్యాగ్ లు ట్విట్టర్ లో తెగ ట్రెండ్ కాగా వాటిపై మెగా అభిమానులు ఘాటుగానే స్పందించారు.
తన కూతురిపై వచ్చే విమర్శలకు నాగబాబు కూడా దీటుగానే సమాధానం ఇచ్చారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన ఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్‌ను పరిమితికి మించి నడపటం వల్ల పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు తను చాలా క్లియర్. ఇక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో ఎలాంటి అనవసరమైన పుకార్లకు తావు ఇవ్వకూడదని నేను వీడియో రిలీజ్ చేస్తున్నానని అన్నారు. అంతేకాక ఓ డాగ్ వీడియోని కూడా విమర్శలకు సమాధానంగా తన సోషల్ మీడియాలో నాగబాబు షేర్ చేశారు.
అయితే పబ్ సంఘటన నిహారిక ఇమేజ్ ను చాలా డ్యామేజ్ చేసింది. నిహారిక ఈ నెగెటివిటీని త్వరలోనే తొలగించాలని కోరుకుంటోంది. తన సోషల్ మీడియా ద్వారా చుట్టూ సానుకూలతను సృష్టించే విధంగా ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌ను డీయాక్టివేట్ చేసినందున, ఆమె ఒక స్టేట్‌మెంట్‌తో పునరాగమనం చేయనుందట. అలాగే తన తాజా వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల తర్వాత మీడియా ముందు హల్ చల్ చేయాలనుకుంటోంది. నిజానికి ఆమె ఓ సీరియల్ నిర్మిస్తూ మరో సినిమాలో నటిస్తోంది. మరి ఇంతకు ముందు ఆమెకు ఉన్న పేరు మళ్లీ ఇప్పుడు వస్తుందా.. లేదా.. అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…